Badvel Bypoll: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ తప్పనిసరి అయిపోతోంది. ఇప్పటికే వైసీపీ, బీజేపీ పోటీలో ఉండగా కాంగ్రెస్ కూడా బరిలో నిలవనున్నట్లు ప్రకటించడంతో త్రిముఖ పోరు అనివార్యమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశముంది. కానీ జనసేన, టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవమవుతుందని అందరు భావించినా బీజేపీ మాత్రం పోటీలో ఉంటున్నట్లు చెప్పింది. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని భావించి పోటీకి సై అంటోంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా జత కావడంతో పోటీ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సంప్రదాయాలు పాటించడం లేదు. దీంతో బద్వేల్ లో పోటీలో నిలిచి తమ ఉనికి చూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిగా సుధ పోటీలో ఉండగా బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం విజయం సాధించేంత పట్టు మాత్రం లేకున్నా పోటీలో నిలిచి తమ పంతం నిలుపుకోవాలని చూస్తున్నాయి.
గతంలో జరిగిన తిరుపతి, నందిగామ ఎన్నికల్లో కూడా సంప్రదాయాలకు గుడ్ బై చెప్పి పోటీలో నిలిచాయి. బద్వేల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. సరైన అభ్యర్థిని రంగంలో దింపాలని చూస్తోంది. బీజేపీ కూడా పోటీలో ఉండడంతో త్రిముఖ పోరు నెలకొంది. అయినా ఇక్కడ ఎన్నిక ఏకగ్రీవమే అని తెలిసినా బీజేపీ, కాంగ్రెస్ మాత్రం పోటీలో నిలిచి ఏకగ్రీవానికి స్వస్తి పలికాయి.
బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పోటీలో ఉండడంతో ఏ మేరకు ఓట్లు చీల్చుతాయో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎలాగూ వైసీపీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎంత మేర ఓట్లు వస్తాయోనని అంచనా వేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నకల్లో పార్టీల బలం ఎంత ఉందని తెలుసుకోవడానికి ఈ ఎన్నిక ఓ తార్కాణంగా నిలుస్తుందని చెబుతున్నారు.