బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజు కి రచ్చ పెరుగుతూనే వస్తుంది. నామినేషన్ల రోజు అయితే చెప్పనక్కర్లేదు… కదిలించకపోయిన కదిలించిన బాగా ఆడినా, ఆడకపోయినా.. నవ్వించినా.. నవ్వించకపోయినా.. చిన్న తప్పు చేసినా.. చేయకున్నా సరే కంటెస్టెంట్లు కారణాలు చూపి మరి నామినేట్ చేసి గొడవ పడేలా చేస్తారు.

అలా నిన్న సోమవారం జరిగిన నామినేషన్స్ తర్వాత బిగ్ బాస్ హౌస్ వాతావరణమే మారిపోయింది. కిచెన్ డ్యూటీ పంపకాల గురించి పెద్ద రచ్చే జరిగింది. కెప్టెన్ శ్రీరామ చంద్ర, సిరి, షన్ను, జెస్సీ ల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. తాజా గా బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమో లో రవి, కాజల్ మధ్య పెద్ద చిచ్చు మొదలై కార్చిచ్చులా విజృంభిస్తుంది.
బెడ్ రూమ్ లో పడుకుని రవి, లోబో ముచ్చట్లు పెట్టుకుంటుంటే.. కాజల్ అంతగా వెళ్లి జోకులు వేయడం ప్రారంభించింది. ‘నిన్న గొడవ జరిగింది దేనికంటే… రవి, లోబో ఇద్దరు కలిసి కిచెన్ డిపార్ట్మెంట్ లోకి రావడమే అని ఎక్కిరిస్తూ, నవ్వుతూ, ఎగిరింది. అది చిలికి చిలికి గాలివానగా మారినట్లు తెలుస్తోంది. కాజల్ మాటలను సీరియస్ గా తీసుకున్న రవి ఒక్కసారిగా బెడ్ రూమ్ లో నుండి కిచెన్ లోకి వచ్చి కాజల్ మీద సీరియస్ అయ్యినట్టు ప్రోమో లో కనిపిస్తుంది.
నేను ఏదో సరదాగా అన్నాను అని కాజల్ అంటుంటే…. నీకు సరదానేమో కానీ అవతలి వ్యక్తి కాదు అని రవి ఘాటుగా సమాధానమిచ్చాడు. అయినా ఇదంతా తెలియకుండానే బిగ్ బాస్ హౌస్ కి ఎలా వస్తారు అని కాజల్ మీద ఫైర్ అయ్యాడు. అంతే కాకుండా నాకు రెచ్చకొట్టడం బాగా వచ్చు అంటూ కాజల్ మీద సీరియస్ అయ్యాడు. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుందో అని తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే మరి…