బాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు.!

వైసీపీ, టీడీపీ రెండు ఒకే రకమైన విధానాలను అవలంభిస్తాయని ఈ రెండింటి మధ్య ఏలాంటి తేడా ఉండదని కమ్యూనిష్టులు చెబుతుంటారు. రాజకీయ లబ్ధికోసం ఎదుటివారిపై విమర్శలు చేసినా తమ దాఖా వస్తే మళ్లీ అదే విధానాన్ని ఈ రెండు పార్టీల నాయకులు అవలంభిస్తారు. కరోనా భారిన పడి వైసీపీ నేతలు హైదరాబాదు వెళ్లి కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పోందడం చూశాం. వీరిలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఏంపీ విజయసాయిరెడ్డి, మరి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. […]

Written By: Neelambaram, Updated On : August 21, 2020 2:21 pm
Follow us on


వైసీపీ, టీడీపీ రెండు ఒకే రకమైన విధానాలను అవలంభిస్తాయని ఈ రెండింటి మధ్య ఏలాంటి తేడా ఉండదని కమ్యూనిష్టులు చెబుతుంటారు. రాజకీయ లబ్ధికోసం ఎదుటివారిపై విమర్శలు చేసినా తమ దాఖా వస్తే మళ్లీ అదే విధానాన్ని ఈ రెండు పార్టీల నాయకులు అవలంభిస్తారు. కరోనా భారిన పడి వైసీపీ నేతలు హైదరాబాదు వెళ్లి కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పోందడం చూశాం. వీరిలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఏంపీ విజయసాయిరెడ్డి, మరి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అంశంపై టీడీపీ అధికార పక్షాన్ని ఎండగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్యంపై నమ్మకం లేక వీరు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారని విమర్శించింది.

Also Read: జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

తాజాగా టీడీపీ నాయకులు కరొనా వైరస్ సోకడంతో చికిత్స కోసం హైదరాబాదు వెళ్లడం ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో కడప జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్లే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా భారిన పడ్డారు. కరొనా టెస్టులో పాజిటివ్ అని తెలియడంతో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బైయిలు మంజూరు చేసింది. కడప జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి కడప నుంచి నేరుగో హైదరాబాదుకు వెళ్లి అక్కడ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా నుంచి కోలుకునేందుకు చికిత్స పొందుతున్నారు.

Also Read: మోడీ బాటలో పవన్ ?

వైసీపీ నేతలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చికిత్స పొందడం తప్పని సోషల్ మీడియా వేదికగా టీడీపీ ఏండగట్టింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కరోనాతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో హైదరాబాదులోని ప్రవేటు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చారు. మరి ఇప్పుడు టీడీపీ నాయకులు కరోనా చికిత్స కోసం హైదరాబాదు పరిగెత్తడంపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఏం సమాధానం చెబుతారని వైసీపీ ప్రశ్నిస్తుంది. కరోనా సోకిన ప్రజల గురించి పట్టించుకోని ఈ నేతలు తమ వరకూ వస్తే మాత్రం ముందు వెనుకా చూడకుండా కార్పోరేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.