https://oktelugu.com/

కులాంత‌ర ప్రేమ‌క‌థతో అల్లు అరవింద్ ఫెయిల్ !

మంచి కంటెంట్ సినిమాలనే తన ఓటీటీ సంస్థ ఆహా కోసం తీసుకుంటారనే నమ్మకం రోజురోజుకు పోతుంది. ‘బుచ్చినాయుడు కండ్రిగ – తూర్పు వీధి…’ అనే సినిమాని ఆహా సంస్థ ప్రకటించగానే.. టైటిలే విచిత్రంగా ఉంది. సినిమాలో కూడా మ్యాటర్ బాగానే ఉంటుందనే నమ్మకం పెట్టుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. Also Read: వంద కోట్లతో విజయ్‌‌ దేవరకొండ మూవీ.. తప్పదు మరి..? తనను కాదన్న అమ్మాయి పై అబ్బాయి పెంచుకున్న ద్వేషాన్ని మెయిన్ కథగా తీసుకుని.. ఆ […]

Written By:
  • admin
  • , Updated On : August 21, 2020 / 02:21 PM IST
    Follow us on


    మంచి కంటెంట్ సినిమాలనే తన ఓటీటీ సంస్థ ఆహా కోసం తీసుకుంటారనే నమ్మకం రోజురోజుకు పోతుంది. ‘బుచ్చినాయుడు కండ్రిగ – తూర్పు వీధి…’ అనే సినిమాని ఆహా సంస్థ ప్రకటించగానే.. టైటిలే విచిత్రంగా ఉంది. సినిమాలో కూడా మ్యాటర్ బాగానే ఉంటుందనే నమ్మకం పెట్టుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది.

    Also Read: వంద కోట్లతో విజయ్‌‌ దేవరకొండ మూవీ.. తప్పదు మరి..?

    తనను కాదన్న అమ్మాయి పై అబ్బాయి పెంచుకున్న ద్వేషాన్ని మెయిన్ కథగా తీసుకుని.. ఆ అమ్మాయి కోసం పిచ్చోడై మద్యానికి బానిసైన ఆ కుర్రాడి కథగా వచ్చిన ఈ నాసిరకం ప్రేమ కథకు అల్లు అరవింద్ 70 లక్షల ఎమౌంట్ నే సమర్పించుకున్నాడంటే.. అల్లు అరవింద్ జడ్జ్ మెంట్ గాడి తప్పిందనే అర్ధం. ఈ సినిమా అసలు బాగాలేదు, మరి అల్లు అరవింద్ ఒక్కడే ఈ సినిమాని ఎందుకు అంతగా నమ్మాడో.. అంత నమ్మకంతో ఈ సినిమాని ఎలా కొనగలిగాడో.. అర్ధం కావడం లేదు.

    కాగా ప‌చ్చ‌ని ప‌ల్లెటూరు.. కులాంత‌ర ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో న‌వ‌త‌రం న‌టీన‌టుల‌తో తెర‌కెక్కించిన ఈ ‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’ తాజాగా `ఆహా` ఓటీటీలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమాని ఒకసారి స‌మీక్షిస్తే.. ముందుగా కథాక‌మామీషు ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే హీరో బాలు (మున్నా) జీవితంలోని ప్రేమ‌క‌థ వ్యవహారం బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి అనే విలేజీలో ఎలా సాగిందనేదే కథలో మెయిన్ బాగోతం.

    Also Read: ‘నిశ్శబ్దం’గా 25 కోట్ల డీల్… అక్కడ శబ్దం చేస్తుందా మరి?

    మూవీ ఆద్యంతం ల్యాగ్ తో బోర్ ప్లేతో సాగుతూ విసిగిస్తోంది. కామెడీ కూడా ఆశించినంత స్థాయిలో వ‌ర్క‌వుట్ కాక చెత్త సినిమాగా నిలిచింది. ప‌రువు కోసం ప్రాణం తీసే పెద్ద‌మ‌నుషుల క‌థ‌లో ఎంత సీరియస్ నెస్ ఉండాలి. కానీ ఈ సినిమా సిల్లీ కథనంతో సాగింది. దీనికి తోడు కొత్త నాయ‌కానాయిక‌లు కూడా చెత్తగా నటించారు. చిత్తూరు యాస ప్ర‌య‌త్నించినా అంత‌గా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.

    ఈ సినిమాలో ప్ల‌స్ పాయింట్స్‌ అంటూ ఏమి లేవు. మైన‌స్ పాయింట్స్ ను పరిశీలిస్తే.. రొటీన్ ప్రేమ‌క‌థ‌, చెత్త టేకింగ్, క‌థ‌నంలో ల్యాగ్ బాగోతం, బోరింగ్ ప్లే ఇలా ఎన్నైనా ముచ్చటించుకోవచ్చు. మొత్తానికి కామన్ సెన్స్ లేని కులాంత‌ర ప్రేమ‌క‌థ‌లో కనీసం నిజాయితీ కూడా లేదు.