https://oktelugu.com/

అచ్చెన్న, జేసీ అరెస్టులు పథకం ప్రకారమే..? ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయ్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన ఏడాదిలో ఆయన పాలన పై ప్రశంసల వర్షం కురిసినా…. ఆ తర్వాత మాత్రం నిదానంగా ఎంత మంది విమర్శకులు రాష్ట్రంలో అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారు. వీటన్నింటినీ పక్కన పెడితే ఒక రెండు నెలలు ముందు టీడీపీ నేతల వరుస అరెస్టులు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని సొంతం నివాసం నుండి అతని ఆరోగ్యం బాగోలేకపోయినా…. అరెస్టు చేసి తీసుకుని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 21, 2020 / 01:36 PM IST
    Follow us on

    ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన ఏడాదిలో ఆయన పాలన పై ప్రశంసల వర్షం కురిసినా…. ఆ తర్వాత మాత్రం నిదానంగా ఎంత మంది విమర్శకులు రాష్ట్రంలో అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారు. వీటన్నింటినీ పక్కన పెడితే ఒక రెండు నెలలు ముందు టీడీపీ నేతల వరుస అరెస్టులు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని సొంతం నివాసం నుండి అతని ఆరోగ్యం బాగోలేకపోయినా…. అరెస్టు చేసి తీసుకుని వెళ్ళిన తీరు.. ఎప్పుడో జెసి దివాకర్ పైన ఉన్న కేసులను ఒక్కసారిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు బయటకు వెలికితీసి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన వెంటనే అతనిని అదుపులోకి తీసుకోవడం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అయింది. 

    Also Read : మోడీ బాటలో పవన్ ?

    అయితే ఇప్పుడు రోజులు గడిచేకొద్దీ టిడిపి నేతలు జగన్…. కుట్రపూరితంగా ఆ అరెస్టులు చేయించారు అన్న వాదనను పక్కన పెట్టేసి పరిస్థితులకు అలవాటు పడిపోతున్న తరుణంలో ఇప్పుడు కొత్త అనుమానాలు రావడం మొదలయ్యాయి. ఇప్పటివరకు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన వందల కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కాం కు సంబంధించి ఒక్క రూపాయి అవినీతి సొమ్ము కూడా కూడా బయట పడలేదు. ఇంకా ఏసీబీ అధికారులు మీడియా ముందుకు వచ్చి అచెన్నాయుడుకి ఈ స్కామ్ వలన ఆర్థికంగా రూపాయి కూడా లాభం లేదని అతను కేవలం అధికారులు స్కామ్ చేసేందుకు సహాయ పడ్డాడని తెలపడం జరిగింది. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి కేసు బలంగా లేకపోవడంతో అతనికి బెయిల్ కూడా వచ్చేసింది. 

    ముఖ్యంగా అచ్చెన్నాయుడు విషయానికి వస్తే ఆరోగ్యం బాగాలేకపోయినా రెండు నెలలు విపరీతమైన వరుస విచారణలు జరిపినా కూడా ఒక్కరి పేరూ బయటికి రాలేదు. ఒక్క రూపాయి అవినీతి సొమ్ము కూడా అధికారులు వెలికి తీయలేకపోయారు. ఇన్ని రోజులు ఒక చార్జిషీటు లేదు, కీలకమైన వ్యక్తుల అరెస్టులు లేవు, అవినీతి సొమ్ము వెలికితీత లేదు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం మూడు రాజధానులు విషయంలో అటు టిడిపి రాయలసీమ నేతలను…. ఇటు టిడిపి ఉత్తరాంధ్ర నేతల నుండి తామకు ఏమాత్రం వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ అరెస్టులతో వారిలో భయం నెలకొల్పి …అదుపులో ఉంచేందుకు వీరిని అరెస్టు చేసినట్లు ఉంది అని కొత్త వాదనలు తెరమీదకు వస్తున్నాయి. 

    ఎలాగో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు రాజధాని వికేంద్రీకరణ కు వ్యతిరేకంగా ఏడ్చి గగ్గోలు పెడతారు. అలాంటి సమయంలో ఉత్తరాంధ్ర నేతలు కూడా వారికి జత కలిస్తే కొత్త చిక్కులు తప్పవు.. అందుకే ముందు జాగ్రత్తగా ఎవరికీ అనుమానం రాకుండా ఆ రెండు ప్రాంతాల నుండి ఒకరిద్దరు నేతలు ఈ ప్రాంతం నుండి ఒక నేతపై అసలు బలమైన కేసులు కాకపోయినా కావాలని అధికారులను  అధికారులను ఒత్తిడి చేసి వారిపై ఆ కేసులను బనాయించి అరెస్టు చేయించారని అంటున్నారు. మరి ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని మీరంటారా?

    Also Read : సీపీ రివార్డు ప్రకటన సరైందేనా?