ప్రతిపక్షానికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని ఏపీ సీఎం జగన్ అనుకుంటూ ఉంటారు. అందుకే.. అటు కరోనా విషయంలో ఎవరి నుంచి విమర్శలు రాకుండా ఊహించని స్థాయిలో టెస్టులు చేస్తున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన గ్యాస్ పైప్ లీకేజీలో చనిపోయిన మృతులకు కోటి రూపాయల చొప్పున సహాయం ప్రకటించారు. దీంతో ఎవరూ నోరు తెరవకుండా అయ్యింది. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి రథం మంటల బారిన పడింది. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో వారి మంటలను చల్లార్చేందుకు జగన్ రంగంలోకి దిగారు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది.
Also Read: ఇంగ్లీష్ మీడియంపై జగన్ మార్క్ ఆలోచన..
తాజాగా ప్రభుత్వం సంచలన నిర్ణయాల్ని తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ సీనియర్ ఐఏఎస్ అధికారిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. అంతర్వేది దేవస్థానం కార్యనిర్వహణ అధికారినీ తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిద్దరిని ప్రాధాన్యత లేని విభాగాలకు పంపడం ద్వారా ప్రభుత్వం ఈ విషయంపై ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటివరకు దేవాదాయ, రెవెన్యూ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జేఎస్వీ ప్రసాద్‌ను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థకు డైరెక్టర్‌గా పంపించారు. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పూర్తస్థాయి అడిషనల్ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక అంతర్వేది ఆలయ కార్యనిర్వహణాధికారి చక్రధర రావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారిని ఇన్‌చార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: శిరోముండనం కేసు: నిందితుల అరెస్ట్ ను నిలిపేస్తూ హైకోర్టు సంచలనం
దేవస్థానం రథం దగ్ధం కావడంపై రాజకీయంగా పెద్ద ఎత్తున నిరసనలే వ్యక్తం అయ్యాయి. అయితే.. ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలను ఖాతరు చేయని ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలకు దిగింది. విమర్శల్ని పట్టించుకోకుండా ముందుకెళ్లడమే మంచిదని భావించింది. రథం దగ్ధం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మంచిది కాదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీలైన తొందరగా ఘటనపై నిజాయితీగా చర్యలు తీసుకుంటే.. రాజకీయ పార్టీలు తప్పు పట్టే అవకాశం ఉండదన్న భావనతో ఉంది. ప్రజలు కూడా హర్షిస్తారన్న అభిప్రాయాన్నీ ప్రభుత్వ పెద్దల మాటగా చెబుతున్నారు.