https://oktelugu.com/

YCP MPs: ఏపీని ఆదుకోవాలంటున్న ఎంపీలు.. పార్ల‌మెంటులో దీనంగా వేడుకోలు

YCP MPs: రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని పార్లమెంట్‌లో వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే రాష్ట్రం ఇక నిలదొక్కుకోలేని పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు అందరూ పార్లమెంటులో ఇదే పాట పాడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని కేంద్రం ఆదుకోవాలని కోరుతున్నారు. పార్లమెంట్‌లో మంగళవారం రోజున మిథున్ రెడ్డి మాట్లాడారు. ఇక రాష్ట్రం పూర్తిగా దివాలా తీసేలా ఉందని, కేంద్ర ప్రభుత్వమే తమను గట్టెంక్కించాలన్న విధంగా మాట్లాడారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 15, 2021 4:38 pm
    Follow us on

    YCP MPs: రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని పార్లమెంట్‌లో వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే రాష్ట్రం ఇక నిలదొక్కుకోలేని పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు అందరూ పార్లమెంటులో ఇదే పాట పాడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని కేంద్రం ఆదుకోవాలని కోరుతున్నారు.

    YCP MPs

    YCP MPs

    పార్లమెంట్‌లో మంగళవారం రోజున మిథున్ రెడ్డి మాట్లాడారు. ఇక రాష్ట్రం పూర్తిగా దివాలా తీసేలా ఉందని, కేంద్ర ప్రభుత్వమే తమను గట్టెంక్కించాలన్న విధంగా మాట్లాడారు. ఆయన మాటలకు చాలా మంది షాకయ్యారు. ఆయన ప్రసంగానికి ముందు అనకాపల్లి ఎంపీ సైతం ఇదే విధంగా మాట్లాడారు. రాష్ట్రలోటును కేంద్రం పూడ్చాలని విన్నవించారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ఎంపీలు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం పూర్తిగా లోటుకు వెళ్లిపోయిందనేలా ఉన్నాయి వారి మాటలు.

    ఇదే టైంలో టీడీపీ ఎంపీలు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. రాష్ట్రం ఆ స్థితికి వచ్చేందుకు జగన్ ప్రభుత్వమే కారణమని, ఆ ప్రభుత్వం చేసిన అక్రమాలేనని చెప్పుకొచ్చారు. పరిమితి దాటి రుణాలు తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. జగన్ ప్రభుత్వం ఇటీవల సవరణ చేసిన ఎఫ్ఆర్‌బీఎం చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని, కేంద్రం కలుగజేసుకుని చర్యలు తీసుకోవాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్రం సైతం వ్యూహాత్మకంగానే సమాధానమిచ్చింది.

    Also Read: Love hotels: ల‌వ‌ర్స్ కోసం ల‌వ్ హోట‌ళ్లు.. ఇండియాలోనూ పెరుగుతున్న ఆద‌ర‌ణ‌..!

    ఏపీ ఆర్థిక పరిస్థితి ఇలా మారడానికి కారణం ఆ ప్రభుత్వం చేసిన పనులే కారణమంటూ కేంద్రంతో ఇన్ డైరెక్ట్‌గా చెప్పి్స్తున్నారు టీడీపీ ఎంపీలు. ఏపీ పథకాల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది చెప్పారు నిర్మలా సీతారామన్. ఆదాయానికి సంబంధించి సరిగ్గా అంచనాలు వేయలేకపోయారంటూ వివరించింది. ఇగ మిగతావి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి కానీ, వాటి గురించి ఆమె మాట్లాడలేరు. దీంతో కేంద్రాన్ని ఆదుకోవాలని కోరితే, తమ ఆర్థిక విధానాలే కారణమని కేంద్రం చెప్పడంతో కథ అడ్డం తిరిగిందని భావిస్తున్నారు వైసీపీ ఎంపీలు. మరి తర్వాత ఎంపీలు కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకొస్తారో చూడాలి.

    Also Read: Kenya Drought: కెన్యాలో దుర్భిక్ష పరిస్థితులు.. ఎక్కడ చూసినా జంతువుల కళేబరాలే..?

    Tags