Love hotels: లవ్ హోటళ్లు.. ఏంటి పేరు వినగానే కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారా.. మన దేశంలో ప్రేమ అనేది ఓ పెద్ద పదం. పెద్దలు ఒప్పుకోనిది.. ప్రేమికులు నెత్తిన పెట్టుకునేది. అయితే ప్రేమికులకు ఇంట్లో ఫోన్ మాట్లాడుకునేంత ఫ్రీడమ్ ఉండదు కదా. తల్లి దండ్రులు, ఇంట్లో వారు ఉంటారు కాబట్టి ప్రేమికులకు ఇబ్బందులు తప్పవు. బయట ఎక్కడైనా సీక్రెట్ గా కలుసుకోవాల్సిందే తప్ప ఇంట్లో అంత ఫ్రీడమ్ ఉండదు. ఇక కొత్తగా పెండ్లి చేసుకున్న జంటలకు కూడా ఇలాంటి ఫ్రీడమ్ దొరకదు.
అయితే ఇలాంటి వారి కోసమే హాంకాంగ్‌లో లవ్ హోటళ్లు ఉన్నాయి. ఇవి దాదపు 1960 నుంచే నడుస్తున్నాయి. ఏకాంతం కోరుకునే లవర్స్ అలాగే కొత్తగా పెండ్లి అయిన వారు వీటిలో గడుపుతుంటారు. ఇవి అక్కడ చాలా ఫేమస్. ప్రస్తుతం హాంకాంగ్ లో 300 వరకు ఈ లవ్ హోటళ్లు పనిచేస్తున్నాయి. హాంకాంగ్ లో ఉండే ఇండ్లు చాలా ఇరుకుగా ఉంటాయని, కాబట్టి అవి శృంగారానికి పనికి రావని, కొత్త ఇల్లు కొనుక్కునే పరిస్థితులు అందరికీ ఉండవు కాబట్టి కొత్త జంటలు ఈ లవ్ హోటల్స్‌కు నెలలో ఐదు నుంచి ఆరుసార్లు వస్తుంటాయంట.
లవర్స్ లేదంటే కపుల్స్ ఈ హోటల్స్‌కు వచ్చి కబుర్లు చెప్పుకోడానికి బాగా ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. ఇందులో గంటల చొప్పున రూమ్ లను బుక్ చేసుకోవచ్చు. గంటకు ఇంత అని పేమెంట్ ఉంటుంది. ఇకపోతే హాంకాంగ్ లో ఎక్కువ ఇండ్లు చాలా ఎక్కువ ధరలు ఉంటాయి కాబట్టి విశాల వంతమైనవి కొనుక్కోలని ప్రజలు ఇలా లవ్ హోటళ్లను వాడుతున్నారన్నమాట. చైనీస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుసానే చోయ్ తన అధ్యయనంలో ఈ విషయాలను చాలా కూలంకుశంగా వివరించారు.
Also Read: Success Story: వెయ్యి రూపాయల పెట్టుబడితో రూ.కోట్లు సంపాదిస్తున్న మహిళ.. ఎలా అంటే?
ఇకపోతే ఇప్పుడు ఇండియాలో కూడా వీటికి బాగా ఆదరణ పెరుగుతోంది. ఇండియాలో కూడా యువ జంటలు లవ్ హోటళ్లను ఓ వరంలా భావిస్తున్నారు. దీంతో వీటికి రాను రాను కస్టమర్లు పెరుగుతున్నారు. ఇండియాలో కూడా యూత్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండ్లు కూడా ఇరుకుగానే ఉంటాయి. కాబట్టి వీటికి డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇది మన కల్చర్‌ను పాడుచేస్తుందని చాలామంది విమర్శిస్తున్నారు. కానీ యూత్ మాత్రం ఇది ఫ్రీడమ్‌కు బాగా ఉపయోగపడుతుందని చెబుతోంది.
Also Read: Kenya Drought: కెన్యాలో దుర్భిక్ష పరిస్థితులు.. ఎక్కడ చూసినా జంతువుల కళేబరాలే..?