https://oktelugu.com/

Anchors turned Actress: యాంక‌ర్లుగా చేసి హీరోయిన్లుగా మారిన వారు ఎంద‌రో తెలుసా..?

Anchors turned Actress: వెండితెర‌, బుల్లితెర‌కు విడ‌దీయ‌రాని సంబంధం ఉంటుంది. బుల్లితెర మీద రాణించే వారంతా వెండి తెర‌మీద మెర‌వాల‌ని అనుకుంటారు. అయితే వెండితెర మీద రాణిస్తున్న వారు కూడా బుల్లితెర మీద అవ‌కాశం వ‌స్తే వినియోగించుకుంటారు. ఇక పోతే యాంక‌ర్లు కూడా మొద‌ట బుల్లితెర‌మీద స‌త్తా చాటు ఆ త‌ర్వాత హీరోయిన్‌గా అయిన వారు చాలామంది ఉన్నారు. తెలుగు నాట రోజురోజుకూ ఇలాంటి వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. యాంక‌ర్ అన‌గానే మ‌న‌కు ఎక్కువ‌గా గుర్తుకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 15, 2021 / 04:31 PM IST
    Follow us on

    Anchors turned Actress: వెండితెర‌, బుల్లితెర‌కు విడ‌దీయ‌రాని సంబంధం ఉంటుంది. బుల్లితెర మీద రాణించే వారంతా వెండి తెర‌మీద మెర‌వాల‌ని అనుకుంటారు. అయితే వెండితెర మీద రాణిస్తున్న వారు కూడా బుల్లితెర మీద అవ‌కాశం వ‌స్తే వినియోగించుకుంటారు. ఇక పోతే యాంక‌ర్లు కూడా మొద‌ట బుల్లితెర‌మీద స‌త్తా చాటు ఆ త‌ర్వాత హీరోయిన్‌గా అయిన వారు చాలామంది ఉన్నారు. తెలుగు నాట రోజురోజుకూ ఇలాంటి వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. యాంక‌ర్ అన‌గానే మ‌న‌కు ఎక్కువ‌గా గుర్తుకు వ‌చ్చే పేరు సుమ క‌న‌కాల‌.

    Anchors turned Actress

    ఇన్ని రోజులు టాప్ యాంక‌ర్ గా ఉన్న ఈమె ఇప్పుడు వెండి తెర‌మీద‌కు ఎంట్రీ ఇచ్చింది. 46 ఏళ్ళ వయసులో జయమ్మ పంచాయితీ అనే మూవీ చేస్తోంది సుమ‌. ఈమెకు లీడ్ రోల్ లో ఇదే మొద‌టి సినిమా. అయితే సుమ‌కంటే ముందు హాట్ యాంక‌ర్ అనసూయ కూడా సినిమాలు చేస్తోంది. పెద్ద సినిమాల్లో మంచి క్యారెక్ట‌ర్లు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు పుష్ప‌లో దాక్షాయ‌ణిగా భ‌య‌పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇక‌పోతే రష్మి గౌతమ్ కూడా హీరోయిన్ గా చాలా సినిమాలే చేసింది. గ్లామర్ డోస్ లో అంద‌రు యాంక‌ర్ల కంటే ఈమె ముందువ‌రుస‌లో ఉంది.

    ప్ర‌స్తుం భోలా శంక‌ర్‌లో మూవీ చేస్తోంది. గ‌తంలో గుంటూరు టాకీస్ తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక యాంక‌ర్ శ్రీముఖి కూడా ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. గ‌తంలో చిన్న చిన్న క్యారెక్ట‌ర్ల‌లో మెరిసిన శ్రీముఖి ఇప్పుడు మెయిన్ రోల్ లో న‌టించే సినిమాల‌కు సైన్ చేస్తోంది. ఇప్పుడు వెండితెర‌తో పాటు బుల్లితెర‌మీద కూడా బాగానే రాణిస్తోంది. ఇక వీరి కంటే ముందు కలర్స్ స్వాతి కూడా ఇలాగే యాంక‌ర్ నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కలర్స్ ప్రోగ్రామ్‌కు ఈమె హోస్టింగ్ చేయ‌డంతో క‌ల‌ర్స్ స్వాతిగా గుర్తింపు తెచ్చుకుంది.

    Also Read: Pushpa: ‘పుష్ప’తో పని చేయనున్న రాజమౌళి?

    ఇక స్టార్ హీరోయిన్ రెజీనా కసెండ్రా కూడా గ‌తంలో తమిళనాడులో ఓ టీవీ ఛానెల్‌లో హోస్ట్ గా చేసింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలో హీరోయిన్ గా మారింది. ఇక నాగ‌బాబు కూతురు నిహారిక కూడా ఇంత‌కు ముందు ఢీ ప్రోగ్రామ్ లో హోస్టింగ్ చేసింది. ఆ త‌ర్వాత సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇక ఇప్పుడు పెండ్లి చేసుకుని న‌ట‌న‌కు దూరంగా ఉంటుంది. ఇక మ‌రో హాట్ యాంక‌ర్ విష్ణు ప్రియ కూడా ఇప్పుడు వ‌రుస‌గా హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది. ఇంకోవైపు యాంక‌ర్ గా కూడా సత్తా చూపుతోంది.

    Also Read: ఛ.. వీడేం హీరో ? వద్దులే అండి కృష్ణగారు !

    Tags