https://oktelugu.com/

గెలుపు కోసం డబ్బు తీసుకొని ఎగ్గొట్టిన వైసీపీ ఎమ్మెల్యే?

ఏపీలో సీఎం జగన్ అవినీతి రహిత పాలన అంటూ ముందుకెళ్తున్నాడు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాడు. అవినీతిని అంతం చేస్తానంటున్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిపై నిఘా పెట్టాడు. దీంతో వారికి పైసా పుట్టడం లేదట. అందుకే ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన అప్పులు కూడా తీర్చలేని దురావస్థలో ఉన్నారని ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారం బయటపడడంతో ఇది వెలుగుచూసింది. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2020 / 10:01 AM IST
    Follow us on

    ఏపీలో సీఎం జగన్ అవినీతి రహిత పాలన అంటూ ముందుకెళ్తున్నాడు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాడు. అవినీతిని అంతం చేస్తానంటున్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిపై నిఘా పెట్టాడు. దీంతో వారికి పైసా పుట్టడం లేదట. అందుకే ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన అప్పులు కూడా తీర్చలేని దురావస్థలో ఉన్నారని ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారం బయటపడడంతో ఇది వెలుగుచూసింది.

    గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై తాజాగా అప్పు తీసుకొని ఎగ్గొట్టిందని ఓ వైసీపీ నేత మీడియాకు ఎక్కడం దుమారం రేపింది. ఎన్నికల సమయంలో తన వద్ద అప్పు తీసుకుందని.. తిరిగి ఇవ్వడం లేదని వైసీపీ నేత మేకల రవి సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. ఈ వీడియో విడుదల చేయడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది.వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి.. ఎన్నికల వేళ తన వద్దకు వచ్చి ‘తన భర్త మోసం చేశాడని.. రూ.1.40 కోట్లు అప్పుగా తీసుకుందని’ మేకల రవి తెలిపాడు. గెలిచాక రూ.40 లక్షలు తిరిగి ఇచ్చిందని.. మిగతా రూ.80 లక్షలు అడిగితే బెదిరిస్తోందని చెబుతున్నాడు. ఇక రూ.80 లక్షల అప్పు తీర్చమంటే డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు సరిపెట్టుకోవాలని అంటోందని మేకల రవి ఆరోపిస్తున్నాడు.

    డబ్బు కోసం ఎమ్మెల్యే శ్రీదేవి ఇంటికి వెళితే దుర్భాషలాడిందని.. ఎస్పీకి ఫోన్ చేసి లోపల వేయిస్తానంటూ బెదిరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే శ్రీదేవి బెదిరింపులపై సీఎం జగన్ దృష్టి పెట్టాలని మేకల రవి కోరాడు.

    ఇలా వైసీపీలోని ఎమ్మెల్యేల కష్టాలు విని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎమ్మెల్యే అయితే చాలు కోట్లు సంపాదించి మనవళ్లు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చొనేలా కరిగించే ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు లక్షల కోసం ఇలా ఇక్కట్లు పడుతున్న వైనం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ పాలనలో వైసీపీ ఎమ్మెల్యేల కరువుపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.