RGV Perni nani: పేర్నినానితో వర్మ భేటి: పవన్, బాలయ్యలపై హాట్ కామెంట్స్

RGV Perni nani: సినిమా టికెట్లు, టాలీవుడ్ విషయంలో  కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని కొద్దిరోజులుగా ప్రశ్నిస్తూ వచ్చిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఎట్టకేలకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల సినిమా రంగం దెబ్బతింటుందని గోల చేసిన వర్మ ఆ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పేర్ని నానితో మీటింగ్ అనంతరం రాంగోపాల్ వర్మ విలేకరులతో మాట్లాడారు. టికెట్ […]

Written By: NARESH, Updated On : January 10, 2022 5:08 pm
Follow us on

RGV Perni nani: సినిమా టికెట్లు, టాలీవుడ్ విషయంలో  కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని కొద్దిరోజులుగా ప్రశ్నిస్తూ వచ్చిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఎట్టకేలకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల సినిమా రంగం దెబ్బతింటుందని గోల చేసిన వర్మ ఆ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

perni-nani-rgv

మంత్రి పేర్ని నానితో మీటింగ్ అనంతరం రాంగోపాల్ వర్మ విలేకరులతో మాట్లాడారు. టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించానని వర్మ తెలిపారు. ఐదు కీలక అంశాలపై చర్చించామన్నారు. పేర్ని నాని చెప్పిన విషయాలను వర్మ సినీ పెద్దలకు వివరిస్తానని చెప్పారు. పద్ధతి ప్రకారం ఇక నుంచి ముందుకెళుతాం.. దీనికి పరిష్కారం కనుగొంటాం.. ఇక ఏపీ ప్రభుత్వానికి తాను ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు.. తుది నిర్ణయం ఏపీ ప్రభుత్వానిదేని’ రాంగోపాల్ వర్మ అన్నారు.

రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించలేదని వర్మ హాట్ కామెంట్స్ చేశారు. కేవలం వైసీపీకి వ్యతిరేకులైన పవన్ కళ్యాణ్, బాలకృష్ణను టార్గెట్ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఇక తాను టాలీవుడ్ తరుఫున రాలేదని.. ఒక సినిమా నిర్మాతగా మాత్రమే వచ్చానని వర్మ తెలిపారు. ఎవరైతే సినిమా తీశారో వాళ్లే టికెట్ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలన్నారు.

ఇక ఈ సమస్య పరిష్కారం బాధ్యత సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం ఇద్దరిపైనా ఉందని వర్మ సూచించారు. తన చర్చలు నూటికి నూరుశాతం సంతృప్తితో ఉన్నట్టు వివరించారు.