Chinna Jeeyar Swamy- YCP Leaders: చినజీయర్ స్వామి రెండు రాష్ట్రాల్లో శత్రువులా మారారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తన పేరు ముద్రించలేనే నెపంతో జీయర్ స్వామిని దూరం పెడుతూ వస్తున్నారు. ఆ సమయంలో జగన్ కూడా ఆహ్వానించారు. కానీ కేసీఆర్ రాకపోవడంతో ఆయన పేరు వేయలేదు. దీంతో కేసీఆర్ జీయర్ స్వామిని టార్గెట్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఏ కార్యక్రమంలో కూడా ఆయన లేకుండా చేస్తున్నారు. యాదాద్రి ఆలయ ప్రారంభానికి కూడా ఆయనను పిలవలేదు.

రెండు రోజుల కిందట చినజీయర్ స్వామి రాజమండ్రి పర్యటనకు వెళ్లారు. కానీ అక్కడ ఆయనను ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఆయనకు ఆగ్రహం వచ్చింది. తాను రాజకీయ నాయకుడిని కూడా కాదు కదా నాపై ఎందుకంత ద్వేషం అనే చర్చ మొదలైంది. మొత్తానికి చినజీయర్ స్వామిని కేసీఆర్ పక్కకు పెట్టడంతో జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read: Jagan KTR: రహస్య చర్చలకే కేటీఆర్, జగన్ దావోస్ వెళుతున్నారా?
జగన్ కు జీయర్ స్వామి అంటే ప్రత్యేకమైన అభిమానమే. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్లే వారు కాదు. కానీ కేసీఆర్ తో వ్యవహారం దూరం కావడంతో తాను దగ్గరగా ఉంటే ఏమనుకుంటారో అనే భావంతోనే జగన్ కూడా ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ దూరం పెడితే జగన్ ఎందుకు దూరం ఉండటం అనే వాదన వస్తున్నా కేసీఆర్ కనుసన్నల్లోనే జగన్ కూడా నడుస్తారనే విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చిన జీయర్ స్వామి ఏపీ రోడ్ల తీరుపై విమర్శలు చేశారు. ఎప్పుడు జగన్ ను మాట అనని స్వామి ప్రస్తుతం ఆయన వైఖరికి విసిగిపోయి ప్రభుత్వంపై తమ అక్కసు వెళ్లగక్కారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదేదో జగన్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారయ్యే ప్రమాదముందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి చినజీయర్ స్వామి విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావాలనే దురుద్దేశంతోనే పక్కకు పెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

రాజకీయాలు వేరు భక్తి వేరు. కానీ భక్తినే రాజకీయం చేస్తున్నారు. పాలకులకు అందరూ ఒక్కటే. వారు ఎవరైనా సమానంగాచూడటంలోనే వారి హుందాతనం బయటపడుతుంది. ఆ గుణం కేసీఆర్ లో లేదు. తనకు ఇష్టం లేని వారంటే వారిని ఎప్పటికైనా పక్కకు పెట్టడం రాజకీయాల్లో మంచి సంస్కృతి కాదని తెలిసినా ఆయన మొండి వైఖరిని అవలంభిస్తుంటారు. కానీ ఎప్పటికైనా అది దెబ్బకే వస్తుంది. పాలకుల్లో విచక్షణ మరిచి వ్యక్తిగత ద్వేషాలు పెంచుకోవడం మంచిది కాదనే వాదనలు వస్తున్నాయి.
Also Read:Telangana BJP: బీజేపీ నేతల పర్యటనల వెనుక ఆంతర్యమేమిటో?
[…] Also Read: Chinna Jeeyar Swamy- YCP Leaders: కేసీఆర్ కోసమే చినజీయర్ స… […]
[…] Also Read: Chinna Jeeyar Swamy- YCP Leaders: కేసీఆర్ కోసమే చినజీయర్ స… […]