Chanakya Niti: డబ్బులు ఏట్లో వేసినా ఏంచి వేయాలంటారు. అలాగే మనం ఎవరికైనా సాయంచేసినా అది సార్థకం కావాలి. అంతే కాని అవసరం లేని వారికి సహాయం చేస్తే అది నిరర్థకమే. అపాత్ర దానం చేయకూడదు. నిజంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం మానవులుగా మనధర్మం. అందుకోసం మనం ఎంత సాయం చేసినా తప్పులేదు. కానీ అవసరం లేని చోట మనం చేసే సాయం విలువ లేని పైస లాంటిది అవుతుంది. అందుకే కీడెంచి మేలెంచు అన్నారు. ఏది మంచో ఏది చెడో అని క్షుణ్ణంగా పరిశీలించాకే సాయం చేయడం ఉత్తమం. దీనిపై చాణక్యుడు, కౌటిల్యుడు నీతి శాస్త్రాలు రచించి మనకు అందించారు. వారు సూచించిన ప్రకారం మనం నడుచుకోవాలి.

Chanakya Niti
ఇతరులకు సాయం చేయాలనే గుణం చిన్నప్పటి నుంచే అలవరచుకోవాలి. అందుకు గాను తల్లిదండ్రులు పిల్లలకు మంచి గుణాలు అలవడేలా చూడాలి. వారిలో దయా గుణం ఉండేలా సూచించాలి. ఎదుటి వారు కష్టాల్లో ఉంటే వారికి సాయం చేసి వారి బాధలను దూరం చేయడం నిజంగా మంచి పనే. కానీ నేడు ఎంతవరకు ఆ పని చేస్తున్నారు. పక్కవాడు నష్టపోతేనే సంతోషపడుతున్నారు. ఈర్ష్య, అసూయ, ద్వేషం అన్ని కలిసి మనిషిలో రాక్షసుడని ప్రేరేపిస్తున్నాయి.
Also Read: Chinna Jeeyar Swamy- YCP Leaders: కేసీఆర్ కోసమే చినజీయర్ స్వామిని దూరం పెడుతున్న వైసీపీ నేతలు?
మనం సాయం చేసే వారి వ్యక్తిత్వాలను గుర్తించాలి. చెడు స్వభావం గల స్త్రీకి సాయం చేస్తే మనకు కీడు జరుగుతుంది. అలాంటి వారిని మనం దగ్గరకు తీయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పేరు వాడుకుని ఆమె తన పనులు చేసుకుని మిమ్మల్ని చెడు మార్గంలోకి లాగే ప్రమాదం ఉంటుంది. అందుకే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వారికే సాయం చేయాలి. అప్పుడే మనం చేసే పనికి సార్థకత ఉంటుందని తెలుసుకోవాలి.

Chanakya Niti
నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదు. ఎప్పుడు ఏడ్చే వారికి ఎలాంటి సాయం అందించకూడదు. ఎప్పుడు బాధ పడేవారు ఎదుటి వారి బాధలు పట్టించుకోరు. దీంతో మనం వారికి సాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది. ఇలాంటి వారు ఇతరుల విజయాలను చూసి ఓర్వలేరు. అసూయ గుణంతో అందరు బాగు పడొద్దని భావిస్తుంటారు. అందుకే ఇలాంటి వారికి కూడా సాయం చేయడం నిరర్థదాయకమే.
తెలివి తక్కువ వారికి కూడా సాయం చేయడం వృథా. వీరు కూడా ఎప్పుడు చెడునే పట్టుకుంటారు. మంచి అనేది వారికి అర్థం కాదు.దీంతో ఎంత మంచి విషయం చెప్పినా అందులో చెడును వెతుక్కుని మరీ ప్రశ్నిస్తారు. ఇలాంటి వారికి సాయం చేయడం కన్నా ఏ బిచ్చగాడికో చేస్తే కనీసం తలుచుకుంటాడు. అందుకే చాణక్యుడు, కౌటిల్యుడు సూచించిన సూత్రాల ప్రకారం మనం సాయం చేసే వారికి అర్హతలు ఉన్నాయో లేవో చూసుకుని సాయం చేయడం మంచిది. లేకపోతే మన చేసే సహాయం పనికి రాకుండా పోతోందని గుర్తించాలి.
Also Read:Telangana BJP: బీజేపీ నేతల పర్యటనల వెనుక ఆంతర్యమేమిటో?
Recommended Videos: