వైసీపీ దృష్టంతా రఘురామపైనే.. టార్గెట్ చేస్తున్న నేతలు

లోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ నేతలు చేయని ప్రయత్నాలు లేవు. అయినా వారి ఆశలు నెరవేరడం లేదు. ఎంపీ రఘురామపై ఈగ కూడా వాలడం లేదు. దీంతో వైసీపీ వర్గాల్లో అసంతృప్తి రేగుతోంది. ఎలాగైనా ఆయనపై అనర్హత వేటు వేయించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాపై ఇప్పటికే ఒత్తిడి పెంచినా పని కాలేదు. ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో సభను స్తంభింపచేస్తామని చెప్పినా స్పందన […]

Written By: Srinivas, Updated On : July 15, 2021 6:11 pm
Follow us on

లోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ నేతలు చేయని ప్రయత్నాలు లేవు. అయినా వారి ఆశలు నెరవేరడం లేదు. ఎంపీ రఘురామపై ఈగ కూడా వాలడం లేదు. దీంతో వైసీపీ వర్గాల్లో అసంతృప్తి రేగుతోంది. ఎలాగైనా ఆయనపై అనర్హత వేటు వేయించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాపై ఇప్పటికే ఒత్తిడి పెంచినా పని కాలేదు.

ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో సభను స్తంభింపచేస్తామని చెప్పినా స్పందన లేకుండా పోతోంది. పార్టీ వ్యవహారాన్ని సభలో ప్రస్తావించడం ద్వారా చులకనై పోతామని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభలో అవలంభించబోయే విధానాలపై చర్చించేందుకు సీఎం జగన్ ఎంపీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.

దీనికి రఘురామకు ఆహ్వానం అందలేదు. వైసీపీ ప్రభుత్వం లోక్ సభలో ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీ. కానీ బీజేపీకి మిత్రపక్షంగానే వ్యవహరిస్తోంది. ఎక్కడ కూడా సమస్యలపై పోరాడిన దాఖలాలు లేవు. స్టేట్ కు సంబంధించిన ఏ ఒక్క అంశంపైనా ఇంతవరకు మాట్లాడిన దాఖలాలు లేవు. పోలవరం ప్రాజెక్టు గురించైనా, కృష్ణా జలాల వివాదం, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, పెండింగ్ నిధుల విడుదల, రుణ పరిమితి తగ్గింపు, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి సమస్యలపై ఎప్పుడూ మాట్లాడలేదు.

ఇప్పుడు వైసీపీ దృష్టంతా రఘురామ కృష్ణంరాజుపై ఉంది. ఆయనకు అనర్హత వేటు వేసేలా స్పీకర్ పై ఒత్తిడి తేవాలనే విషయంపైనే ప్రధానంగా సీఎం సలహాలిస్తారన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది. సభను స్తంభింపచేయడంతోపాటు ఆయనపై ఆరోపణలు చేయడం ద్వారా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తరహా ప్రయత్నాలను ఇప్పటికే విజయసాయిరెడ్డి ప్రారంభించారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వైసీపీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉందన్నారు.