https://oktelugu.com/

భార్యను చంపాలని నాలుగో ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..

ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు. నూరేళ్లు తోడుంటానని బాస చేశాడు పెళ్లి నాటి ప్రమాణాల సాక్షిగా నడుస్తానన్నాడు. ఏడేళ్ల క్రితం చేసుకున్న పెళ్లితో ఒక్కటైన జంట ఇంట నిత్యం వేధింపులే సాగుతున్నాయి. కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ శాడిస్ట్ లా మారాడు. తాగుడుకు బానిసై కిరాతకంగా హత్యచేయాలని మూడుసార్లు ప్రయత్నించాడు. చివరికి విఫలం కావడంతో ఎలాగైనా నాలుగోసారి తుదముట్టించాలని పథకం వేశాడు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పీలేరు మండలం కటకాడ పల్లెకు చెందిన శైలజకు రామిరెడ్డిపల్లికి చెందిన […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 15, 2021 / 06:25 PM IST
    Follow us on

    ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు. నూరేళ్లు తోడుంటానని బాస చేశాడు పెళ్లి నాటి ప్రమాణాల సాక్షిగా నడుస్తానన్నాడు. ఏడేళ్ల క్రితం చేసుకున్న పెళ్లితో ఒక్కటైన జంట ఇంట నిత్యం వేధింపులే సాగుతున్నాయి. కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ శాడిస్ట్ లా మారాడు. తాగుడుకు బానిసై కిరాతకంగా హత్యచేయాలని మూడుసార్లు ప్రయత్నించాడు. చివరికి విఫలం కావడంతో ఎలాగైనా నాలుగోసారి తుదముట్టించాలని పథకం వేశాడు.

    ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పీలేరు మండలం కటకాడ పల్లెకు చెందిన శైలజకు రామిరెడ్డిపల్లికి చెందిన రాజేంద్రచారితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు త్రివిక్రమాచారి జన్మించాడు. కానీ రాజేంద్రచారి వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. అయినా కొడుకు కోసం శైలజ భరిస్తూ వచ్చింది. ఆమె బయటకు వెళ్తే చాలు ఎవరితో వెళ్లావని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది.

    అతనిలో మానవ మృగం నిద్ర లేచి చివరికి శైలజను చంపాలని నిశ్చయించుకున్నాడు. భార్య గాఢ నిద్రలోకి వెళ్లగా ఆమె పీక కొరికి దిండుతో ముఖాన్ని అదిమి పట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా చనిపోయిందనుకుని భావించి దుప్పటితో చుట్టి ఏమీ ఎరగనట్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తెల్లవారు జామున చిన్నారి ఏడుపులు విన్న చుట్టుపక్కల వారు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా విషయం వెలుగుచూసింది. శైలజ పరిస్థితి విషమంగా ఉండడంతో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

    అక్కడి నుంచి రుయాకు తరలించారు, శైలజ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రచారి పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిపై గృహ హింస, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. భార్యను చిత్రహింసలు పెట్టి చంపాలని చూసిన రాజేంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని స్తానికులు కోరారు.