https://oktelugu.com/

వైసీపీ ఎమ్మెల్యేపై కోర్టుకెక్కిన పార్టీ నాయకులు..!

గుంటూరు జిల్లా మైనింగ్ కార్యకలాపాలకు పెట్టింది పేరు. ఇక్కడ సున్నపురాయితోపాటు రబ్బీసు, రాతి క్వారీలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు హై కోర్టులో పీటీషన్ దాఖలయ్యింది. ఈ పీటీషన్ దాఖలు చేసింది వైసీపీ నాయకులు కావడం ఇక్కడ ట్విస్ట్… హై కోర్టు న్యాయవాది ఎం.నాగ రఘు ఈ పిటీషన్ ను సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండల వైసీపీ నాయకుల తరుపున ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 26, 2020 / 06:10 PM IST
    Follow us on


    గుంటూరు జిల్లా మైనింగ్ కార్యకలాపాలకు పెట్టింది పేరు. ఇక్కడ సున్నపురాయితోపాటు రబ్బీసు, రాతి క్వారీలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు హై కోర్టులో పీటీషన్ దాఖలయ్యింది. ఈ పీటీషన్ దాఖలు చేసింది వైసీపీ నాయకులు కావడం ఇక్కడ ట్విస్ట్… హై కోర్టు న్యాయవాది ఎం.నాగ రఘు ఈ పిటీషన్ ను సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండల వైసీపీ నాయకుల తరుపున ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

    Also Read: సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ

    సత్తెనపల్లి ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కొంత కాలంగా రాజుపాలెం మండలం కొట నెమలిపురి, కొండమోడు గ్రామాల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డతున్నారని వైసీపీ నాయకుల ఆరోపణ. పీటీషన్ ను స్వీకరించిన హై కోర్టు వైసీపీ నాయకులు వేస్తే ప్రజాప్రయోజన వ్యాఖ్యం కిందకు ఎలా వస్తుందని న్యాయవాదిని ప్రశ్నించింది. కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. కేసుకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వం తరుపు న్యాయవాదిని హై కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయవాధి నాగరఘు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, మంత్రి విచారణకు ఆదేశించినా విచారణ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. మైనింగ్ శాఖ అధికారులకు అక్రమ మైనింగ్ గురించిన తెలిసినా స్పందిచడం లేదని విమర్శించారు.

    Also Read: అమరావతికే కాదు… రాష్ట్రంలో ప్రతీ రైతన్నకు ప్రభుత్వాలు నేర్పిన గుణపాఠం ఇదే..!

    జిల్లాలో అక్రమ మైనింగ్ దశాబ్ధాలుగా కొనసాగుతుంది. టీడీపీ హయాంలోను మజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుమతి తీసుకున్న ప్రాంతాని కంటే అధికంగా మైనింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హై కోర్టు ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు మైనింగ్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అక్రమాలు జరిగిన విషయం వాస్తవమేనని నిర్ధారించారు. అప్పట్టో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఈ వ్యవహారంపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు. హై కోర్టు ఆదేశాలను పెద్దగా పట్టించుకోలేదు.