https://oktelugu.com/

మళ్లీ మురుగదాస్‌తో మహేశ్.. ఈ సారి హిట్‌ పక్కా!

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సౌతిండియా స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌ మరోసారి కలిసి పని చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తొందర్లోనే సినిమా రానుంది. మహేశ్‌, మురుగదాస్‌ కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన థిల్లర్ డ్రామా ‘స్పైడర్’ కమర్షియల్‌గా ఫ్లాప్‌గా మిగిలింది. అలాగే, ఆ మూవీలో మహేశ్‌ డ్యాన్స్‌పై తెగ ట్రోలింగ్‌ నడించింది. స్టోరీ బాగున్నా దాన్ని తనదైన శైలిలో ప్రెజెంట్‌ చేయడంలో మురుగదాస్‌ విఫలమయ్యాడు. అలాగే, మ్యూజిక్‌ కూడా పెద్ద మైనస్‌గా మారింది. దాంతో, పెద్ద […]

Written By: , Updated On : August 26, 2020 / 06:24 PM IST
Follow us on


టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సౌతిండియా స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌ మరోసారి కలిసి పని చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తొందర్లోనే సినిమా రానుంది. మహేశ్‌, మురుగదాస్‌ కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన థిల్లర్ డ్రామా ‘స్పైడర్’ కమర్షియల్‌గా ఫ్లాప్‌గా మిగిలింది. అలాగే, ఆ మూవీలో మహేశ్‌ డ్యాన్స్‌పై తెగ ట్రోలింగ్‌ నడించింది. స్టోరీ బాగున్నా దాన్ని తనదైన శైలిలో ప్రెజెంట్‌ చేయడంలో మురుగదాస్‌ విఫలమయ్యాడు. అలాగే, మ్యూజిక్‌ కూడా పెద్ద మైనస్‌గా మారింది. దాంతో, పెద్ద బడ్జెట్‌తో భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే, వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: బాలయ్య బాబుకు హీరోయిన్ గా జయసుధ !

మురుగదాస్‌ ప్రస్తుతం విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి తుపాకి 2 అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ కాగా, విద్యుత్‌ జమ్వాల్‌ విలన్‌. జయరాం, సత్యన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2012లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన తుపాకి కి ఇది సీక్వెల్‌. ఈ మధ్యే రజినీకాంత్‌తో దర్బార్తో హిట్‌ కొట్టిన మురుగదాస్‌ ఫామ్‌లో ఉన్నాడు. భారీ అంచనాలున్న విజయ్‌ 65వ సినిమాపై దృష్టి పెట్టిన ఆయన ఇప్పటికే మహేశ్‌ కోసం కథ సిద్ధం చేశారట. ‘స్పైడర్’లా కాకుండా పక్కా కథనం తయారు చేశారట. మహేశ్‌కు కచ్చితంగా హిట్‌ ఇవ్వాలని మురుగదాస్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాపై తొందర్లోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.