వైసీపీ నేతల తిట్ల దండకం.. ఎస్ఈసీపై ఎందుకంత కోపం..?

ఏపీ ఎన్నికల కమిషనరుపై అధికార వైసీపీ నేతలు చేస్తున్న మాటల దాడి ఇప్పడు చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఎన్నికలు నిర్వహించడమే.. పాపం అన్నట్లుగా.. వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఆయనేదో అంటరాని అదికారి అయినట్లు.. ఒక్కొక్కరు మీడియా ఎదుట ప్రతిపక్ష నేతలను.. ఎస్ఈసీని కడిగి పాడేస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఆయన డీఎన్ఏ, శరీర రంగు గురించి మాట్లాడేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికల కమిషనర్ విదులు నిర్వహించి ఉంటారు.. కానీ.. ఎవరూ ఇలాంటి పరిస్థితులను […]

Written By: Srinivas, Updated On : January 30, 2021 1:46 pm
Follow us on


ఏపీ ఎన్నికల కమిషనరుపై అధికార వైసీపీ నేతలు చేస్తున్న మాటల దాడి ఇప్పడు చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఎన్నికలు నిర్వహించడమే.. పాపం అన్నట్లుగా.. వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఆయనేదో అంటరాని అదికారి అయినట్లు.. ఒక్కొక్కరు మీడియా ఎదుట ప్రతిపక్ష నేతలను.. ఎస్ఈసీని కడిగి పాడేస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఆయన డీఎన్ఏ, శరీర రంగు గురించి మాట్లాడేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికల కమిషనర్ విదులు నిర్వహించి ఉంటారు.. కానీ.. ఎవరూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోని ఉండరు.

Also Read: అంతా మీరే చేశారు… సీఎస్ విషయంలో.. ప్రవీణ్ ప్రకాశ్

సాధారణగా ఎన్నికల కమిషనరుపై ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తుంటారు. ఒకవేళ తాము ఏమీ విమర్శించకపోతే… వారు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తారన్న భావనతోనైనా విమర్శలు చేసేవారు. కానీ విమర్శలకూ హద్దులుంటాయి. తప్పలు మాత్రమే ఎత్తి చూపేవారు. కానీ ప్రస్తుతం ఏపీలో పిరిస్థితి వేరుగా ఉంది. ఎస్ఈసీ ఏం తప్పు చేస్తున్నారో.. చెప్పడం లేదు.. కానీ.. అధికార పార్టీ ఆయనపై దుమ్మెత్తి పోస్తోంది. తిట్టిన తిట్టు తిట్టకుండా.. తిడితే.. మానసికంగా బలహీనపడిపోయి.. తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారన్నట్లుగా వైసీపీ నేతల ప్రవర్తన ఉంది.

Also Read: ప్రభుత్వాన్ని వదలని నిమ్మగడ్డ

ప్రతిపక్ష నేతలపై ఇప్పటికీ ఇలాంటి వ్యూహాలనే వైసీపీ అనుసరిస్తోంది. ఇప్పడు ఎస్ఈసీపైనా ప్రయోగిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ను అంత దారుణంగా తిట్టాలిసిన సందర్భం ఏమిటో వైసీపీ నేతలు చెప్పలేక పోతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం విబంధనలకు విరుద్ధం అయితే.. అదే విషయాన్ని ప్రస్తావించవచ్చు. కానీ నిమ్మగడ్డ జిల్లాల పర్యటనకు వళ్లినా విమర్శిస్తున్నారు. అధికారులతో సమీక్ష పెట్టినా విమర్శిస్తున్నారు. తన విధులు తాను నిర్వహించినా తిడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకన్నది చాలా మంది వైసీపీ నాయకులకు అర్థం అవ్వడం లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లోనే సత్తా చూపుదామని మెజారిటీ వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ పార్టీ హైకమాండ్ నేతలు మాత్రం నిమ్మగడ్డను ఏదో ఒక రకంగా విమర్శించే పనిలో పడాడరు. ఆయనను రెచ్చగొట్టి ఏదోఒక తప్పే చేస్తే.. దాన్ని హైలెట్ చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ పెద్దలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లున్నారనే భావన అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతోంది. సుప్రీం కోర్టు కూడా ఆ అహాన్ని తగ్గించుకోవాలని చెప్పింది. కానీ ఏపీ సర్కారు అవేవీ పట్టించుకోవడం లేదు. ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేనంత మాత్రాన .. ఎస్ఈసీపై తిట్ల దండకం అందుకోవడం సరికాదని పలువరు అంటున్నారు.