ఆంధ్రప్రదేశ్‌YCP Politics : ఆ మంత్రి దందాలపై సొంత పార్టీ నేతలే నిజనిర్థారణ... వైసీపీలో సంచలనం

YCP Politics : ఆ మంత్రి దందాలపై సొంత పార్టీ నేతలే నిజనిర్థారణ… వైసీపీలో సంచలనం

YCP Politics :రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. రాత్రికి రాత్రే పదవులు దక్కించుకున్న వారూ ఉన్నారు. ఏళ్ల తరబడి పడిగాపులు కాసినా అవకాశాలు రానివారు ఉన్నారు. ఒక్కోసారి స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణలు కొందరికి ఇట్టే కలిసొస్తాయి. పదవులే ఎదురొచ్చి పలకరిస్తాయి. ఇటువంటి అదృష్టాన్ని దక్కించుకున్నారు పలాస ఎమ్మెల్యే, ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. ఆయన పొలిటికల్ ఎంట్రీ అనూహ్యం. ఆపై వైసీపీ టిక్కెట్.. ఎమ్మెల్యే..మంత్రి ఇలా ఒకదాని తరువాత ఒకటి వరించింది. అయితే అదృష్టాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు మంత్రి సీదిరి. గత ఎన్నికల్లో తనను గెలిపించిన వారినే దూరం చేసుకుంటున్నారు. విసిగి వేశారిన కొందరు నేతలు ఎదురుతీరగగా.. మరికొందరు అదును కోసం వెయిట్ చేస్తున్నారు.దీంతో పలాస నియోజకవర్గంలో అధికార పార్టీ ఎదురీదుతోంది.

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సాధిస్తామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఎక్కడికక్కడే మంత్రులు, ఎమ్మెల్యేలకు దిగువ స్థాయి కేడర్ తో గ్యాప్ ఉంది. కొన్నిచోట్ల పూడ్చుకోలేనంతగా అగాధం ఏర్పడింది. పలాసలో అయితే మంత్రిపై ద్వితీయ శ్రేణి నాయకులే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎంతో కష్టపడి గెలిపిస్తే.. మంత్రులు, ఆయన ప్రధాన అనుచరులు అవినీతికి పాల్పడుతున్నారంటూ అసమ్మతి నాయకులు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి అప్పలరాజుకు టిక్కెట్ ఇస్తే పనిచేయలేమని తేల్చిచెబుతున్నారు. వన భోజనాల పేరిట ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసుకొని మరీ అసమ్మతి రాజకీయాలు నడుపుతున్నారు. దీంతో మంత్రి ముచ్చెమటలు పడుతున్నారు.

అప్పలరాజుకు మంత్రి పదవి వచ్చిన తరువాత ఆయనపై అవినీతి ఆరోపణలు పెరిగాయి. కొందరు కీలక అనుచరులతో ఆయన భూదందాలకు పాల్పడుతున్నట్టు కూడా విమర్శలు వచ్చాయి. ఓ భూ వ్యవహారంలో మావోయిస్టుల నుంచి బెదింపులు రావడం కలకలం సృష్టించింది. అటు అప్పలరాజు దూకుడు స్వభావం కూడా ఆయనకు చేటు తెస్తోంది. నియోజకవర్గంలో శాంతిభద్రతలు గాడి తప్పడానికి మంత్రి వైఖరే కారణమంటూ ప్రజలు కూడా అనుమానిస్తున్నారు. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ అసమ్మతి శిబిరం స్ట్రాంగ్ అవుతోంది. ఒక్కో నేత చేజారుతుండడంతో అప్పలరాజు ఆందోళనకు గురవుతున్నారు.

తాజాగా వైసీపీ సీనియర్ నాయకులు, అసమ్మతి నేతలు దువ్వాడ హేంబాబు చౌదరి, దువ్వాడ శ్రీకాంత్, జుత్తు నీలకంఠం తదితరులు ఒక నిజ నిర్థారణ కమిటీ వేశారు. మంత్రి, ఆయన అనుచరుల భూదందాపై ఒక నివేదిక తయారుచేసే పనిలో పడ్డారు. గ్రామాల వారీగా ప్రభుత్వ భూముల ఆక్రమణ, ప్రైవేటు ల్యాండ్స్ డీల్ వంటి వివరాలతో ఒక నివేదిక తయారుచేసి పార్టీ హైకమాండ్ కు నివేదించనున్నట్టు ప్రకటించారు. అటు అధిష్టానం కూడా మంత్రి సీదిరి వైఖరిపై మంచి అభిప్రాయంతో లేదు. దూకుడుతో అందర్నీ దూరం చేసుకోవడాన్ని పార్టీ పెద్దలు తప్పుపడుతున్నారు. ఇప్పటికే అప్పలరాజుకు సుతిమెత్తని హెచ్చరికలు చేశారు. అయితే అసమ్మతి నేతలను ఎలా కట్టడి చేయాలో తెలియక మంత్రి తల పట్టుకుంటున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Jada Sravan: వైసీపీ నేతలు ఎంగిలి మెతుకులు కూడా వదిలిపెట్టరు.. జడ శ్రావణ్ ఇలా ప్లేట్ తిప్పాడేంటి..

Jada Sravan: కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలలో జడ శ్రావణ్ సృష్టిస్తున్న సంచలనం అంతా అంతా కాదు. అప్పట్లో క్రైస్తవులు సమావేశం పెట్టుకుంటే.. దానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు శ్రావణ్.. పవన్ కళ్యాణ్ మీద...

Kodali Nani: మోదీని గౌరవిస్తే తట్టుకోలేకపోతున్న కొడాలి నాని!

Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కొడాలి నాని తీరు మారలేదు. నిన్ననే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మళ్లీ పాత పద్ధతిలోనే ఆయన మాట్లాడుతున్నారు. పెద్దవారిని...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version