Amanchi Krishna Mohan: కాటేసిన పాము.. ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందంటే?

తొలుత చీరాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు పొందారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యలు ప్రకటించారు. --6 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తెలిపారు. కట్ల పాము కరిచి ఉంటుందని.. ఆ పాము అంత విషపూరితం కాదని వైద్యులు చెబుతున్నారు. --6 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు ప్రకటించారు.

Written By: Dharma, Updated On : July 18, 2023 9:29 am

Amanchi Krishna Mohan

Follow us on

Amanchi Krishna Mohan: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారు. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జిగా ఆమంచి కొనసాగుతున్నారు. పొట్టి సుబ్బయ్యపాలెంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా పాము కాటు వేసింది. పందిళ్లపల్లి ఆక్వా నర్సరీ వద్ద సొంత రొయ్యల ఫ్యాక్టరీ వద్ద ఘటన చోటుచేసుకుంది. ఉదయాన్ని నడక చేస్తుండగా కాలికి ఏదో గుచ్చుకున్నట్టు కనిపించింది. చూడగా పాము కుట్లు కనిపించాయి. కానీ అక్కడ పాము కనిపించలేదు. దీంతో విషం పైకి ఎక్కకుండా కర్చిఫ్ తో కాలికి కట్టి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు.

తొలుత చీరాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు పొందారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యలు ప్రకటించారు. –6 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తెలిపారు. కట్ల పాము కరిచి ఉంటుందని.. ఆ పాము అంత విషపూరితం కాదని వైద్యులు చెబుతున్నారు. –6 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు ప్రకటించారు.

కృష్ణమోహన్ పాముకాటుకు గురికావడంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అటు చీరాలతో పాటు ఇటు పర్చూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏ పాము కరిచిందో తెలియక వైద్యసేవల్లో అస్పష్టత నెలకొంది. శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వైద్యసేవలందించేందుకే 6 గంటల పాటు ఆయన్ను అబ్జర్వేషన్ లో ఉంచారు. కాగా ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు ఇటీవలే జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.