Homeఎంటర్టైన్మెంట్Childhood Photo: తన ఫొటో చూసుకొని సిగ్గుపడుతున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి..

Childhood Photo: తన ఫొటో చూసుకొని సిగ్గుపడుతున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి..

Childhood Photo: ఇక్కడున్న పాపను చూశారా.. చిన్నప్పుడే చీర కట్టుకొని అలరిస్తుంది. వయసు చిన్నదైనా పెద్దమనిషిలా ఎంతో హుందగా కనిపిస్తోంది. ఈ ఫొటోను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. కానీ తన ఫొటోను చూసి తానే సిగ్గుపడుతున్న పక్కనున్న ఆమె ఓ స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలు చేస్తూ మిగతా హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఈమె నటన చూసి హీరోలే షాక్ అవుతున్నారు. ఇక ఆమె డ్యాన్స్ చేస్తే వెండితెర షేక్ అవుతుంది. ఇప్పటికైనా ఆమె ఎవరో తెలిసిందా? అయితే కిందికి వెళ్లండి..

చిన్నప్పుడే పెద్ద బాధ్యతలు చేపడున్న అమ్మాయిలా కనిపిస్తున్న ఆమె ఎవరో కాదు సాయి పల్లవి. సాయిపల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కొత్తగిరి అనే గ్రామంలో జన్మించారు. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. దీంతో ఆమె పేరులో సాయిని చేర్చారు. కోయంబత్తూర్ లో పాఠశాల విద్యపూర్తి చేసిన ఈమె ఆ తరువాత జార్జియా కళాశాలలో డాక్టర్ కోర్స్ చేశారు. చిన్నప్పటి నుంచే సాయి పల్లవికి కళలంటే ఇష్టం. ఈ నేపథ్యంలో ఆమె నర్తకిగా మారారు. ఏమాత్రం బెరుకు లేకుండా స్టేజీమీద డ్యాన్స్ చేయడం చూసి చాలా మంది సినిమాల్లో నటించాలని సలహా ఇచ్చారు.

అలా ‘ధూంధాం’ అనే తమిళ సినిమాలో కంగనా రానౌత్ పక్కన చిన్న పాత్రలో మొదటిసారి కనిపించింది సాయిపల్లవి. ఆ తరువాత ‘కస్తూరి మాన్’ అనే మూవీలో మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా అలరించింది. అయితే వైద్య విద్య పూర్తి చేసిన తరువాత తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెకు ‘ప్రేమమ్’ అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. దీంతో శేఖర్ కమ్ముల ‘ఫిదా ’ సినిమా కోసం సాయిపల్లవిని ఎంపిక చేశాడు.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈమెకు ఎదురులేకుండా పోయింది. తెలుగులో ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో అలరించింది. ఆమె తమిళంలో నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అయినా ఇక్కడా సక్సెస్ కావడంతో సాయి పల్లవికి ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు. ఇటీవలే సాయి పల్లవి తల్లిదండ్రులతో కలసి అమర్ నాథ్ యాత్ర కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియాతో ఆ విషయాన్ని చెప్పారు. ఇదే సమయంలో తన చిన్ననాటి ఫొటో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version