AP Survey: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రం గత రెండు రోజులుగా పూర్తిగా మారిపోయింది..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూనే అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయం నడుస్తుంది.. ఉత్తరాంధ్రలో శాంతియుతంగా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసింది అనేది ప్రతి ఒక్కరు చూసారు.

అక్రమంగా జనసేన పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ పర్యటనని కూడా అడ్డుకున్నారు..అసలు వైసీపీ పార్టీ ఎందుకు జనసేన మీద ఇంత ఫోకస్ పెట్టింది..?, ఈమధ్య కాలం లో జగన్ కూడా పవన్ కళ్యాణ్ మీద అంత టార్గెట్ చెయ్యడానికి కారణం ఏమిటి అనేది పరిశీలిస్తే, గత కొద్దీ కాలం క్రితం ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన ఒక సర్వే రిపోర్ట్ అని తెలుస్తోంది.. ఈ సర్వే రిపోర్టులో వైసీపీ పార్టీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతోందని.. జనసేన పార్టీ గ్రాఫ్ చాప కింద నీరు లాగా రోజు రోజుకి పెరిగిపోతోంది అని తేలింది.
ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో అయితే జనసేన పార్టీ ఊపు ప్రస్తుతం మాములుగా లేదనే చెప్పాలి.. గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు , కృష్ణ జిల్లాలలో కూడా జనసేన పార్టీ ప్రభావం గట్టిగా ఉంది..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన పార్టీకి 13 శాతం ఓట్ బ్యాంకు వస్తుందని ఆ సర్వే లో తేలింది..పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి పర్యటన చేపడితే కచ్చితంగా ఓటింగ్ శాతం బాగా పెరిగి 23 శాతంకి వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టు ఆ సర్వే రిపోర్ట్ చెప్తుంది..ఇదే కనుక జరిగితే ప్రతిపక్ష టీడీపీ పార్టీకి చాలా గట్టి దెబ్బ తగులుతుందని..వైసీపీ పార్టీనే మళ్ళీ అధికారం లోకి వస్తుందని ఆ సర్వే రిపోర్ట్ లో తేలింది అట.. అలా కాకుండా జనసేన పార్టీ టీడీపీ తో కలిసి పోటీ చేస్తే మాత్రం కోస్తాంధ్ర లో వైసీపీ కి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదట.
ఎన్ని సీట్స్ వచ్చిన రాయలసీమ , నెల్లూరు నుండే రావాలి కానీ ఉత్తాంధ్ర ప్రాంతంలో మాత్రం వైసీపీ పార్టీ పని అయ్యుపోయినట్టే అట..అందుకే వైసీపీ పార్టీ టీడీపీతో జనసేన ఎక్కడ జత కడుతుందో అని వణికిపోతున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ..ఇప్పటికే పవన్ తో చంద్రబాబు కలిశారు. అది ఇలాగే కొనసాగితే వైసీపీకి ఓటమి తప్పదంటున్నారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఇంకెన్ని మలుపు తిప్పుకుంటుందో చూడాలి.