NTR New Look: ఎన్టీఆర్ న్యూ లుక్ వైరల్ గా మారింది. జపాన్ కి పయనమైన ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి రావడం జరిగింది. ఆ సమయంలో ఎన్టీఆర్ ని ఫోటో గ్రాఫర్స్ తమ కెమెరాల్లో బంధించారు. ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ కేకగా ఉంది. ఆ మధ్య ఎన్టీఆర్ కొంచెం వెయిట్ పెరిగారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బొద్దుగా ఒళ్ళు చేసి కనిపించారు. తాజా లుక్ చూస్తుంటే ఎన్టీఆర్ బరువు తగ్గినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఆయన జిమ్ లో బాగా కసరత్తులు చేసి స్లిమ్ అయ్యారనిపిస్తుంది.

ఇక ఎన్టీఆర్ జపాన్ ఆకస్మిక ప్రయాణానికి కారణం… అక్టోబర్ 21న ఆర్ ఆర్ ఆర్ మూవీ అక్కడ విడుదల కానుంది. ఆ చిత్ర ప్రమోషన్స్ కోసం జపాన్ పయనమయ్యాడు. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్ బయలుదేరారు. కాగా ఎన్టీఆర్ కి జపాన్ లో ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ ఆయనకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుందని యూనిట్ అంచనా వేస్తున్నారు. అలాగే రాజమౌళి గత చిత్రాలు బాహుబలి, బాహుబలి 2 జపాన్ లో ఆదరణ దక్కించుకున్నాయి.
యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని విపరీతమైన ఆదరణ దక్కిన నేపథ్యంలో జపాన్ లో మంచి వసూళ్లు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జనరల్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కి పంపారు. జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ విజయం సాధిస్తే అకాడమీ సభ్యులను ఆకర్షించించడానికి, నామినేషన్ అవకాశాలు మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. మొత్తం 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కి ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ అప్లై చేశారు.

మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు. ఆయన 30వ చిత్ర పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. అసలు ఉందా రద్దు అయ్యిందా అనే క్లారిటీ కూడా లేదు. కొరటాల శివ మాత్రం స్క్రిప్ట్ కి మార్పులు చేర్పులు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ లేదు. ఒకవేళ కొరటాల శివతో మూవీ క్యాన్సిల్ అయితే ఎన్టీఆర్ ఎవరితో చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రశాంత్ నీల్ తో మూవీ ప్రకటించినప్పటికీ సలార్ విడుదల తర్వాతే ఎన్టీఆర్ చిత్రం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ కోసం ఎన్టీఆర్ 4 ఏళ్ళు కేటాయించారు.