YCP Focus On Visakhapatnam: ఆ నాలుగింటిపైనే వైసీపీ ఫోకస్.. సాగర నగరంలో ఏం జరుగుతోంది?

YCP Focus On Visakhapatnam:  రాష్ట్రంలో మొత్తం ఆ పార్టీ హవా చూపిస్తోంది. అన్ని ఎన్నికల్లో సత్తా చాటుతూ వస్తోంది. ఆ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం పట్టు సాధించుకోలేకపోతోంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా..ప్రలోభాలు పెట్టినా అక్కడి ప్రజల ఆదరణకు మాత్రం నోచుకోలేకపోతోంది. ఎందుకు అక్కడ అలా జరుగుతోందని అధిష్టానం తల పట్టుకుంటోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పట్టు సాధించాలన్న శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. విశాఖ నగరంలో తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లో అసలు వైసీపీకి […]

Written By: Admin, Updated On : April 5, 2022 10:30 am
Follow us on

YCP Focus On Visakhapatnam:  రాష్ట్రంలో మొత్తం ఆ పార్టీ హవా చూపిస్తోంది. అన్ని ఎన్నికల్లో సత్తా చాటుతూ వస్తోంది. ఆ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం పట్టు సాధించుకోలేకపోతోంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా..ప్రలోభాలు పెట్టినా అక్కడి ప్రజల ఆదరణకు మాత్రం నోచుకోలేకపోతోంది. ఎందుకు అక్కడ అలా జరుగుతోందని అధిష్టానం తల పట్టుకుంటోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పట్టు సాధించాలన్న శతవిధాలా ప్రయత్నం చేస్తోంది.

YCP

విశాఖ నగరంలో తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లో అసలు వైసీపీకి పట్టు దొరకడం లేదు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ విశాఖ నగరంలోని కీలక నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం చతికిల పడింది. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామక్రిష్టబాబు, పశ్చిమ నుంచి పెతకంశెట్టి గణబాబు, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ టీడీపీ నుంచి గెలుపొందారు.

Also Read: Pub Drugs Case: ఏ3గా అర్జున్ వీరమాచినేని.. ఈయన నందమూరి ఫ్యామిలీ అని తెలుసా?

ఇందులో ఒక్క గంటా శ్రీనివాసరావు తప్ప.. మిగతావారు భారీ మెజార్టీతో గెలుపొందిన వారే. వెలగపూడి రామక్రిష్టబాబు అయితే ఏకంగా 27 వేల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. రికార్డు స్రుష్టించారు. అసలు ఇక్కడ ఎందుకు గెలుపొందలేదని వైసీపీ అధిష్టానం పోస్టుమార్టం చేసింది. కానీ ఇక్కడి ప్రజల అంతరంగం వారికి దొరకడం లేదు. రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్నా.. ఇక్కడి ప్రజలు మాత్రం తమను ఎందుకు ఆదరించలేదన్న అంతర్మథనం నేతలను వెంటాడుతోంది. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ డివిజన్లను టీడీపీయే కైవసం చేసుకుంది. దీంతో వైసీపీలో మరింత అంతర్మథనం పెరిగింది. వచ్చే ఎన్నికల నాటికి నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా పాతలన్న నిశ్చయంతో అధిష్టానం ఉంది. అటువైపుగా పావులు కదుపుతోంది.

ప్రజలను దారిలోకి తేవండం ఎలా?
విశాఖను రాజధానిగా ప్రకటించాం. ఈ ప్రాంతాన్ని అభివ్రద్ధికి కంకణం కట్టుకున్నాం. అయినా ప్రజల నుంచి ఎందుకు హర్షాతిరేకాలు వ్యక్తం కావడం లేదన్న భావన వైసీపీ అధిష్టానం, నేతల్లో ఉంది. పాలనా రాజధాని ప్రకటన వచ్చినప్పుడు సైతం విశాఖ ప్రజలు వ్యతిరేకించలేదు. అలాగని హర్షాతిరేకాలు వ్యక్తం చేయలేదు. తీర నగరానికి పసుపు పార్టీ అంటే ఎందుకంత అభిమానమో తెలియడం లేదని వైసీపీ నేతలు వాపోతున్నారు.

YCP Focus On Visakhapatnam

అయితే దీనికి కారణం లేకపోలేదు. హుద్..హుద్ తుపాను గుర్తుంది కదూ.. విశాఖను ఎలా కుకటివేళ్లతో పెకిలించిందో ఇప్పటికీ మనకు గుర్తే. ఆ సమయంలో నాటి సీఎం చంద్రబాబు చూపిన చొరవ, విశాఖ నగర పునరుద్ధరణలో క్షేత్రస్తాయిలో ఆయన చూపిన తెగువను రాజకీయాలకతీతంగా అందరూ అభినందించారు. నాటి గురుతులు విశాఖ నగరవాసుల్లో అలానే ఉండిపోయాయి. ఆ పెను విపత్తు మిగిల్చిన నష్టం, కష్టాన్ని త్వరితగతిన అధిగమించడంలో చంద్రబాబు పాత్ర చాలా ఉంది. అందుకే విశాఖ నగరవాసులకు చంద్రబాబు అంటే అభిమానం.

దాని కారణంగానే విశాఖను రాజధాని చేస్తామన్నా ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపించలేదు. తాయిలాలు ప్రకటించినా అధికార పార్టీ మాటలను నమ్మలేదు. మరోవైపు ప్రశాంత విశాఖ నగరంలో వైసీపీ ఆగడాలు పెచ్చుమీరాయి. ప్రధానంగా ఎంపీ విజయసాయిరెడ్డి పెత్తనాన్ని ఇక్కడి నేతలతో పాటు ప్రజలు సహించలేకపోతున్నారు. రాయలసీమ పోకడలు ఇక్కడా కనిపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. రాజధాని అయితే విశాఖలో ప్రశాంత వాతావరణం కనుమరుగు అవుతుందని భయపడుతున్నారు. ఈ కారణంగానే వైసీపీ అంటే దూరంగా జరుగుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

భారీ స్కెచ్ పారేనా?
ఎలాగైనా విశాఖ వాసులను లొంగదీసుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తొంది. ఇందుకుగాను పేద, మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తోంది. వారిని ఎలాగైనా మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు భారీ స్కెచ్ వేసింది. సుమారు 1.50 లక్షల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. ఆ బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించింది. ఇళ్ల పట్టాలతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. తద్వారా దిగువస్థాయిలో వైసీపీ పట్ల ఉన్న అభిప్రయాన్ని దూరం చేయాలని భావిస్తొంది. అయితే వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

విశాఖ మహానగరంలో వలసవాసులు అధికం. ఒకవేళ ఇళ్లు నిర్మించాలనుకున్నా రాజకీయ సిఫారుసులకే పెద్దపీట వేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీ నేతల భూ లావాదేవీలపై ఆరోపణలున్నాయి. పేదల మాటున బినామీలు తెరపైకి వచ్చే అవకాశముంది. అప్పుడు ప్రభుత్వం అందించే ఇళ్ల పట్టాలు, ఇళ్లు పక్కదారి పట్టే అవకాశముంది.

Also Read:AP GOVT Key decision On SPOS: స్పెషల్ పోలీసులకు ఎసరు.. మాజీ సైనికుల పోరుబాట

Tags