Sonu Sood: ఆపద సమయంలో ఆదుకుంటూ దాన ధర్మాలు చేస్తోన్న సోనూసూద్ కి “కలియుగ కర్ణుడు” అంటూ బిరుదులు కూడా ఇచ్చారు. అయితే, తాజాగా ఈ బాలీవుడ్ నటుడు పై పంజాబ్‌లో కేసు నమోదైంది. సోనూ సూద్ సోదరి మాళవిక కాంగ్రెస్‌లో చేరి మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.
అయితే ఆదివారం పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున తన సోదరి కోసం సోనూ ప్రచారం చేస్తూ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళికి సంబంధించి ఆదేశాలను ఆయన ధిక్కరించడంతో కేసు నమోదు చేసినట్టు మోగా పోలీసులు తెలిపారు.
Also Read: రష్మికతో పెళ్లి పై విజయ్ సీరియస్
ఏది ఏమైనా ఆపద సమయంలో ఆదుకుంటూ దాన ధర్మాలు చేస్తూ సోనూసూద్ ఎందరో హృదయాలను గెలుచుకున్నాడు. నేటికీ ట్విట్టర్‌లో ఆయన చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తూ వస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా కూడా ఎందరికో సేవ చేస్తున్నాడు.
అసలు కరోనా మహమ్మారి దావానలంగా దేశం మొత్తం వ్యాప్తి చెంది, జనాన్ని ముప్పు తిప్పలు పెడుతూ దొరికిన వారిని దొరికినట్లు పొట్టన పెట్టుకుంటూ ఉన్న కాలంలో కూడా ఎంతోమందిని ఆదుకున్నారు సోనూసూద్. అసలు కరోనా దేశ స్థితి గతులని అస్తవ్యస్తం చేస్తోన్న తరుణంలో పేద ప్రజల పరిస్థితిని బాగు చేయడానికి సోనూసూద్ ముందుకు రావడం అభినందనీయం.
అందుకే ప్రజలకు ఏ కష్టం వచ్చినా సోనూసూద్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను వారి వారి సొంత ఊర్లకు చేర్చి వారి పట్ల దేవుడు అయ్యాడు సోనూసూద్.
Also Read: బీజేపీ చూపు ముద్రగడ వైపు.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు?
Recommended Video: