Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda- Rashmika Marriage: రష్మికతో పెళ్లి పై విజయ్ సీరియస్

Vijay Devarakonda- Rashmika Marriage: రష్మికతో పెళ్లి పై విజయ్ సీరియస్

vijay devarakonda- rashmika mandanna:  యువ హీరో విజయ్ దేవరకొండ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. వీరిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఫుల్గా సొంతం చేసుకున్నారు. అయితే ఈ జంట.. ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలెక్కనుందంటూ తెగ వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఇటీవల రష్మిక ప్రేమ, పెళ్లి గురించి కూడా మాట్లాడింది. అప్పటి నుంచి ఈ ఏడాది చివర్లో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

vijay devarakonda- rashmika mandanna
vijay devarakonda- rashmika mandanna

ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మాత్రం కచ్చితంగా విజయ్-రష్మికలలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే అని అనుకుంటున్న సమయంలో వీటిపై తాజాగా విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతీసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందంటూ తన మార్క్ ట్వీట్ వేశాడు. విజయ్ స్పందనతో వీరి లవ్ మేటర్‌పై పూర్తి క్లారిటీ వచ్చేసింది.

Also Read: గ‌ద్వాల్ రెడ్డి బిడ్డ ఎలా ఫేమ‌స్ అయ్యాడు.. ఎలా చనిపోయాడు..?

నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సినిమాల్లో కలిసి నటిస్తున్నప్పటి నుంచీ వారి మధ్య రిలేషన్‌ షిప్‌‌పై ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఏ రోజూ విజయ్ దేవరకొండ, రష్మికలు తోసిపుచ్చలేదు. అలాగని కన్ఫామ్ కూడా చేయలేదు. వైఫ ప్రస్తుతం విజయ్, రష్మిక ముంబయిలో డేటింగ్‌లో ఉండటం వీరి పెళ్లి వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.

vijay devarakonda- rashmika mandanna
vijay devarakonda- rashmika mandanna

హిందీలో వరుస ఆఫర్స్ వస్తుండగా రష్మిక ముంబైలో ఎక్కువగా కనిపిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను మూవీ చేస్తున్న ఆమె, అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై మూవీలో నటిస్తోంది. అలాగే తెలుగులో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఆడాళ్లు మీకు జోహార్లు మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: బీజేపీ చూపు ముద్రగడ వైపు.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు?

Recommended Video:

#BheemlaNayak Trailer Review | Pawan Kalyan | Rana Daggubati | Trivikram | Saagar K Chandra

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

Exit mobile version