YCP MLAs: వైసీపీ ధనిక పార్టీ : 151 మంది ఎమ్మెల్యేల్లో.. 146మంది కోటీశ్వరులే

వైసీపీ ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తారు. ఆ పార్టీకి ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజా అధ్యయనం ప్రకారం 146 మంది ఎమ్మెల్యేలు అత్యంత సంపన్నులేనని తేలింది.

Written By: Dharma, Updated On : August 2, 2023 10:21 am

YCP MLAs

Follow us on

YCP MLAs: తెలుగు రాష్ట్రాల్లో ధనిక పార్టీగా వైసీపీ నిలుస్తోంది.ఆ పార్టీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్పించి అందరూ కోటీశ్వరులే. ఏడిఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఇది తేలింది. 28 రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోనే మొత్తం 4,033 మంది ఎమ్మెల్యేలకు గాను 4,001 ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో సమర్పించిన అఫీడవిట్లను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు.

వైసీపీ ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తారు. ఆ పార్టీకి ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజా అధ్యయనం ప్రకారం 146 మంది ఎమ్మెల్యేలు అత్యంత సంపన్నులేనని తేలింది. సగటున వీరిలో ఒక్కొక్కరికీ రూ.23.14 మేర ఆస్తులు ఉన్నాయని ఈ నివేదిక తేల్చింది. రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలకు గాను..174 మంది అఫీడవిట్లను పరిశీలించారు. ఏపీలో ఎమ్మెల్యేల ఆస్తులు రూ.4,914 కోట్లు గా ఉన్నట్లు నివేదిక వివరించింది.

గతంలో నేర చరిత్ర విషయంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు రికార్డు సృష్టించారు. జాతీయస్థాయిలో మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ధనిక విభాగంలో కూడా ముందంజలో నిలవడం విశేషం. 2019 ఎన్నికల్లో జగన్ అభ్యర్థుల ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని టిక్కెట్లు ఇచ్చారు. ఆర్థిక స్థితిమంతులకే ఫస్ట్ ప్రయారిటీ కల్పించారు. ఇప్పుడు ఈ తాజా అధ్యయనంలో కూడా అదే తేలింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆర్థికంగా గట్టిపట్టున్న అభ్యర్థులను వెతికే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న కోటీశ్వరులకు మించి ఖర్చు పెట్టగల వారి కోసం జగన్ అన్వేషిస్తున్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో వైసిపి యే అత్యంత ధనిక పార్టీగా తేలింది.