Ambati Vs TG Vishwaprasad: ఏపీ మంత్రి అంబటి రాంబాబు బ్రో మూవీ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. రాజకీయంగా, నిజ జీవితంలో ఏమీ చేయలేని పవన్ కళ్యాణ్ సినిమాల్లో పాత్రల ద్వారా తన కసి తీర్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. శ్యామ్ బాబు పేరుతో చేసిన థర్టీ ఇయర్స్ పృథ్వి చేసిన ఒక పాత్ర వివాదానికి దారి తీసింది. గతంలో సంక్రాంతి వేడుకల్లో అంబటి రాంబాబు డాన్స్ చేశారు. దీనిపై సెటైరికల్ గా బ్రో మూవీలో శ్యామ్ బాబు పాత్ర పెట్టారనేది ప్రధాన ఆరోపణ.
మీడియా వేదికగా అంబటి రాంబాబు బ్రో చిత్ర యూనిట్ పై ఫైర్ అయ్యారు. ఇలాంటివి పునరావృతం అయితే గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. మూల్యం చెల్లిస్తారని హెచ్చరికలు జారీ చేశారు. అయితే చిత్ర యూనిట్ అంబటి రాంబాబు కామెంట్స్ ని కొట్టిపారేస్తున్నారు. ఆ పాత్రతో అంబటి రాంబాబుకు ఎలాంటి సంబంధం లేదు. కథలో భాగంగానే పెట్టామంటున్నారు. శ్యామ్ బాబు పాత్ర చేసిన పృథ్వి అయితే… అసలు అంబటి రాంబాబు ఎవరో కూడా నాకు తెలియదు. ఆయనను నేను ఇమిటేట్ చేయడమేంటి అంటూ కౌంటర్ వేశారు.
తాజాగా దర్శకుడు సైతం అంబటి రాంబాబు ఆరోపణలు ఖండించారు. గట్టి సమాధానం చెప్పారు. ప్రేక్షకులు సినిమా చూసి వంద రకాల కామెంట్స్ చేస్తారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిందే అని యాంకర్ టీజీ విశ్వప్రసాద్ ని అడిగారు. ఎమ్మెల్యే అయినా ఒక సామాన్యుడు అయినా… ఆరోపణల్లో నిజాయితీ ఉంటే స్పందిస్తాము. కాబట్టి ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
దర్శకుడు సముద్రఖని, హీరో సాయి ధరమ్ తేజ్ సైతం అంబటి రాంబాబుతో ఆ పాత్రకు సంబంధం లేదన్నారు. చూస్తుంటే ఈ వివాదం ముగిసేలా లేదు. మునుముందు ఎవరు ఎవరిపై మాటల దాడి చేస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా స్పందించలేదు. బహుశా వారాహి యాత్రలో ఈ విషయం మీద ఆయన కామెంట్స్ చేసే అవకాశం కలదు. బ్రో తమిళ చిత్రం వినోదాయసితం రీమేక్ గా తెరకెక్కింది. త్రివిక్రమ్ కథనం, మాటలు అందించారు.
దమ్మున్న ప్రొడ్యూసర్ @peoplemediafcy#BroTheAvatar pic.twitter.com/AzqsoHRGiL
— ѶᏋຖӄค₮ (@megacpr_only) August 2, 2023