YCP Internal Fight: ఏ పొలిటికల్ పార్టీ అయినా తమకంటూ సొంత ఎజెండా, నియమ నిబంధనలను పెట్టుకుంటుంది. వాటిని తమ పార్టీలోని నేతలు కాని కార్యకర్తలు కాని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వెంటనే చర్యలకు పూనుకుంటుంది. ఈ క్రమంలోనే తమ పార్టీ అధిష్టానం నిర్దేశించిన లైన్‌ను దాటి బయటకు పోవద్దని నేతలు, కార్యకర్తలు అనుకుంటుంటారు. అయితే, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అటువంటి పరిస్థితులు లేవని తాజాగా జరిగిన ఘటన ద్వారా స్పష్టం అవుతోంది.
వైసీపీకి తనకంటూ సొంత రాజ్యాంగం ఒకటుందని, అది అర్థం చేసుకున్న వాళ్లు మాత్రమే అందులో మనగలుగుతారని, లేకపోతే ఇక అంతే సంగతులు అనే ప్రచారం జోరుగా సా..గుతోంది. జనరల్‌గా పొలిటకల్ పార్టీలన్నిటిలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. దాని ప్రకారం.. పార్టీలోని లోపాలను, జరుగుతున్న తప్పులను నేతలు ఎత్తి చూపొచ్చు. కాగా, అలా వైసీపీలో జరిగిన లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేసిన వ్యక్తిని వైసీపీ నేతలు చితకబాదారు. ఈ విషయం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
వైసీపీలో పదవులు రాక అసంతృప్తిలో ఉండి నోరెత్తిన వారి నోరు మూయించేందకుగాను వైసీపీ నేతలు ఇటువంటి దాడుల కాన్సెప్ట్ ఎంచుకోవడం సరికాదని వైసీపీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడి విషయంతో ఈ వివరాలు బయటకు వస్తున్నాయి. సుబ్బారావు గుప్తా అంశంలో కొడాలి నాని, అంబటి రాంబాబు వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. సుబ్బారావు గుప్తా వీడియోలో మాట్లాడుతూ తాను బాలినేనికి ఎన్నో ఏళ్లుగా తెలుసని, తాను ఆయన కోసం ఎంతో కష్టపడ్డానని, కానీ, తనకు ఎటువంటి గుర్తింపు లేదని వాపోయారు. కనీసంగా తనకు చిన్న పదవి అయినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: MLA Roja: ఎమ్మెల్యే రోజా.. సామాజిక సేవలోనే అనుభవిస్తున్న మజా
సుబ్బారావు గుప్తా వీడియో బయటకు వచ్చిన క్రమంలో వైసీపీలో ఆయన లాంటి వారందరూ ఎందరో ఉన్నారనే చర్చ జరుగుతోంది. కాగా, సుబ్బారావు గుప్తాపై దాడి నేపథ్యంలో పార్టీలో తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా నోరెత్తితే వారిపై దాడులు ఖాయమనే సంకేతాన్ని వైసీపీ అధినాయకత్వం ఇచ్చేసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి కాని రాజ్యాంగం గురించి కాని మాట్లాడే వారు ఇకపై సైలెంట్‌గా ఉండాలని, లేదంటే ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం లేదనే మెసేజ్ సుబ్బారావు గుప్తా ఇన్సిడెంట్ ద్వారా వైసీపీ అధిష్టానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక వైసీపీలో వేరే ఏ లీడర్స్ కూడా అంతర్గత ప్రజాస్వామ్యంపైన కాని పార్టీలో అవకాశాల గురించి కాని మాట్లాడే సాహసం చేయరని తాజా ఘటనల నేపథ్యంలో అర్థమవుతోంది. చూడాలి మరి.. భవిష్యత్తులో ఏమవుతుందో..
Also Read: CM Jagan: మద్యపాన నిషేధంపై జగన్ మడమ తిప్పేస్తాడా..?