https://oktelugu.com/

Pushpa: వర్కింగ్​డే లోనూ ‘తగ్గేదె లే’ అంటున్న పుష్ప.. డే4 కలెక్షన్​ ఎంతో తెలుసా?

Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా వచ్చిన సినిమా పుష్ప.. థియేటర్లలో సందడి చేస్తోంది. బన్నీ ఈ సినిమాలో ఎప్పుడూ కనిపించని మాస్​ లుక్​లో దర్శనమిచ్చారు. సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన  ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. తొలిరోజు రికార్డు స్థాయిలో 71 కోట్లు రాబట్టి.. సెకెండ్​ వేవ్​ తర్వాత ఈ ఏడాది […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 21, 2021 / 01:41 PM IST
    Follow us on

    Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా వచ్చిన సినిమా పుష్ప.. థియేటర్లలో సందడి చేస్తోంది. బన్నీ ఈ సినిమాలో ఎప్పుడూ కనిపించని మాస్​ లుక్​లో దర్శనమిచ్చారు. సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన  ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. తొలిరోజు రికార్డు స్థాయిలో 71 కోట్లు రాబట్టి.. సెకెండ్​ వేవ్​ తర్వాత ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్ర సాధించింది. ఇక రెండో రోజు కూడా అంతే జోరుతో 54 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా డే4 కలెక్షన్ల వివరాలు తెలిశాయి.

    Pushpa

    Also Read: ‘పుష్ప’ లేటెస్ట్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ అయింది !

    విడుదలైన తొలి మూడు రోజులు వీకెండ్ కావడంతో సాలిడ్​ వసూళ్లు రాబట్టింది. మరి సోమవారం ఎలాంటి ఫిగర్స్​ క్రియేట్​ చేస్తుందా అని అందరూ అనుకుంటుండగా.. అసలు తగ్గేదె లే అన్నట్లు ముందుకు దూసుకెళ్లిపోతోంది. నోలుగో రోజు కూడా ఈ సినిమా 3.45 కోట్లను దక్కించుకుంది. ఇక నైజామ్​లో మొత్తం నాలుగు రోజులకు గాను 26.5 కోట్ల షేర్​ను రాబట్టినట్లు సమాచారం. బయ్యర్లు కూడా మంచి లాభాలతో ఖుషీలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప సందడి ఎక్కడా తగ్గట్లేదని కెలుస్తోంది.

    కాగా, ఈ సినిమా మొదట్లో కాస్త మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. కలెక్షన్ల పరంగా ఎక్కడా వెనకడుగు వేయట్లేదని అర్థమవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రెండో భాగం షూటింగ్​ ఫిబ్రవరిలో మొదలుకానున్నట్లు ప్రకటించారు మేకర్స్​.

    Also Read: రెండో రోజుకే 100 కోట్ల క్లబ్​లో చేరిపోయిన ‘పుష్ప’రాజ్​