https://oktelugu.com/

Rebel Star: ‘రెబల్ స్టార్’ను చూసి భయపడుతున్న డార్లింగ్ ఫ్యాన్స్..!

Rebel Star: ‘బాహుబలి’తో యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ స్టార్డమ్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ తెలుగులో మిక్స్ డ్ టాక్ సొంతంగా చేసుకోగా బాలీవుడ్లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. దీంతో ప్రభాస్ కు ఉత్తరాదిన భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్ నటించిన తాజాగా చిత్రం ‘రాధేశ్యామ్’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 21, 2021 / 02:32 PM IST
    Follow us on

    Rebel Star: ‘బాహుబలి’తో యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ స్టార్డమ్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ తెలుగులో మిక్స్ డ్ టాక్ సొంతంగా చేసుకోగా బాలీవుడ్లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. దీంతో ప్రభాస్ కు ఉత్తరాదిన భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది.

    Rebel Star

    ప్రభాస్ నటించిన తాజాగా చిత్రం ‘రాధేశ్యామ్’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రీ రిలీజ్ హైప్, బుక్సింగ్, ఓపెనింగ్స్ విషయంలో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఆశించిన మేర ‘రాధేశ్యామ్’కు బజ్ రావడం లేదనే టాక్ విన్పిస్తోంది.

    రోమాంటిక్, ట్రాజడీ ప్రేమకథాంశంతో దర్శకుడు రాధాకృష్ణ ఈమూవీని తెరకెక్కిస్తున్నారు. యువీ క్రియేషన్స్ లో రాబోతున్న ఈ మూవీలో రెబల్ స్టార్ కృష్ణంరాజుకు సంబంధించిన లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నెగిటివ్ గా కామెంట్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: రాధేశ్యామ్​ నుంచి మరో సాలిట్​ అప్​డేట్​.. ట్రైలర్​ ఎలా ఉండనుందంటే?

    గతంలో ప్రభాస్-కృష్ణంరాజు కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చాయి. ఈ మూవీలన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ‘రాధేశ్యామ్’ విషయంలోనూ ఇదే జరుతుందా? అనే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ తన పెద్దనాన్న కృష్ణం రాజుతో కలిసి తొలిసారి ‘బిల్లా’లో నటించారు. ఇందులో కృష్ణంరాజు పాత్ర పండకపోగా కామెడీగా మిగిలింది.

    ఆ తర్వాత ‘రెబల్’ మూవీలోనూ వీరిద్దరి కలిసి నటించారు. ఈ సినిమా కూడా ఆశించిన మేర విజయం సాధించలేదు. తాజాగా వీరిద్దరు ‘రాధేశ్యామ్’లో నటిస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో అభిమానులు అనేక భయాలను వ్యక్తం చేస్తున్నారు. మరీ ఈ కామెంట్లను దర్శకుడు రాధాకృష్ణకుమార్ ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే..!

    Also Read: 2022లో సందడి చేయనున్న అగ్రహీరోలు వీరే..