Coffee: మనలో చాలామంది కాఫీ తాగడాన్ని చాలా ఇష్టపడతారు. అలసటగా అనిపించినా ఉత్సాహంగా పని చేయాలన్నా రాత్రి సమయంలో పని చేయాలన్నా కాఫీ తాగితే మంచిదని చెప్పవచ్చు. అయితే కాఫీ పరిమితంగా తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అపరిమితంగా తీసుకోవడం వల్ల అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రతిరోజూ కాఫీ తాగేవాళ్లలో చాలామంది మానసిక ఆందోళనతో బాధ పడుతున్నారు.

కాఫీలో ఉండే కెఫీన్ వల్ల ఉత్తేజంగా, చురుకుదనంతో పని చేయడం సాధ్యమవుతుంది. కాఫీ ఎక్కువసార్లు తాగితే మాత్రం కెఫీన్ మెదడులోని అడెనోసిన్ అనే కెమికల్ ను అడ్డుకుని అలసటగా అనిపించడానికి కారణమవుతుంది. రాత్రి సమయంలో ఎక్కువసార్లు కాఫీ తాగితే భవిష్యత్తులో నిద్రలేమి సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాత్రి సమయంలో కాఫీ ఎక్కువగా తాగితే స్లీప్ సైకిల్ డిస్ట్రబ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
రోజూ ఎక్కువసార్లు కాఫీ తాగేవాళ్లు కాఫీకి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాఫీలో ఉండే కెఫీన్ మెదడులోని కెమికల్స్ పై ప్రభావం చూపి కాఫీకి అడిక్ట్ కావడానికి కారణమవుతుంది. మనలో చాలామంది పరగడుపున కాఫీ తాగుతుంటారు. అయితే పరగడుపున కాఫీ తాగడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక మొత్తంలో శరీరంలో చేరే కెఫీన్ అలసటకు కారణమయ్యే ఛాన్స్ కూడా ఉంది.
అందువల్ల రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత కాఫీకి దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ యాసిడ్ రిఫ్లెక్స్ ను ప్రేరేపించే అవకాశాలు సైతం ఉంటాయి. కాఫీని ఎక్కువగా తాగేవాళ్లు ఆ అలవాట్లను మార్చుకుంటే మంచిది.