బుక్కైన దేవినేని ఉమ.. నెక్ట్స్ టార్గెట్ అతడేనట?

ఒక మొక్కకు అంటుగట్టినట్టు.. ఓ గోడ కట్టినట్టు.. ఓ పద్ధతిగా తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రులను బుక్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఏపీ సీఎంగా గద్దెనెక్కాక పూర్తిగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి వారికి దగ్గరయ్యారు జగన్.. ఏడాది పూర్తికాగానే ప్రతీకారం మొదలుపెట్టాడు. ఓ వైపు సంక్షేమ పథకాలతో తన స్థానాన్ని ప్రజల్లో సుస్తిరం చేసుకుంటూనే మరోవైపు టీడీపీ పునాదులు కూల్చేపనిలో జగన్ బిజీగా ఉన్నాడు. Also Read: ఒకటా.. రెండా..? ఒకే రోజు […]

Written By: NARESH, Updated On : August 27, 2020 7:38 pm
Follow us on


ఒక మొక్కకు అంటుగట్టినట్టు.. ఓ గోడ కట్టినట్టు.. ఓ పద్ధతిగా తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రులను బుక్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఏపీ సీఎంగా గద్దెనెక్కాక పూర్తిగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి వారికి దగ్గరయ్యారు జగన్.. ఏడాది పూర్తికాగానే ప్రతీకారం మొదలుపెట్టాడు. ఓ వైపు సంక్షేమ పథకాలతో తన స్థానాన్ని ప్రజల్లో సుస్తిరం చేసుకుంటూనే మరోవైపు టీడీపీ పునాదులు కూల్చేపనిలో జగన్ బిజీగా ఉన్నాడు.

Also Read: ఒకటా.. రెండా..? ఒకే రోజు జగన్ కు హై కోర్టు మూడు వాతలు !

తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఇప్పటికే ఈఎస్ఐ స్కాంలో బుక్ చేసిన సీఎం జగన్ సర్కార్.. ఆయనకు బెయిల్ కూడా రాకుండా జైల్లోనే ఉంచింది. ఇక అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డిని కటకటాల పాలు చేసింది. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో అరెస్ట్ చేసింది.

అచ్చెన్న, జేసీ, కొల్లు రవీంద్ర తర్వాత టీడీపీ ఎవరు టార్గెట్ అని ఎదురుచూస్తున్న వేళ.. వైసీపీ సర్కార్ కు తాజాగా ఓ లూప్ హోల్ దొరికిందట.. పార్ట్ 1ను దిగ్విజయంగా ముగించిన సీఎం జగన్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో తనపై ఒంటికాలిపై లేచే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమను బుక్ చేసినట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

టీడీపీ ప్రభుత్వ హయాంలోని అవినీతిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్న వైసీపీ సర్కార్ కు తాజాగా పుష్కరాల పనుల్లో అవినీతిపై ఆధారాలు దొరికాయట.. దీంతో దీనిపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. చంద్రబాబు హయాంలో పుష్కరాల పనుల్లో భారీ అవినీతి జరిగిందని.. దానిపై విచారణ చేపట్టారని తెలిసింది. ఈ పుష్కరాల పనులను దగ్గరుండి చూసింది నాటి మంత్రి దేవినేని ఉమ కావడం గమనార్హం. సో వైసీపీ నెక్ట్స్ టార్గెట్ ఉమా అని మీడియాలో వార్తలు లీక్ అవుతున్నాయి.

Also Read: ఆంధ్రకు అప్పుల తప్పులు అలవాటే… కానీ జగన్ ది మరీ ఓవర్ అయిపోయింది!

సీఎం జగన్ దగ్గరుండి మరీ ఈ పుష్కరాల్లో అవినీతి కేసును వేగంగా దర్యాప్తు చేయిస్తున్నారని తెలిసింది. మాజీ మంత్రి దేవినేనిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే పరిస్థితి లేదని వైసీపీ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే ముగ్గురు టీడీపీ నేతలు జైలుపాలయ్యారు. ఇప్పుడు దేవినేని కూడా బుక్ అయితే టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది. వైసీపీలోకి నేతలు చేరడమో లేక టీడీపీకి దూరంగా నేతలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఉపద్రవాన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో వేచిచూడాలి.