https://oktelugu.com/

సుశాంత్ ప్రియురాలు రియా గుట్టు రట్టు?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక రహస్యాలను సీబీఐ వెలికి తీస్తోంది. తవ్వినకొద్దీ ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి మీదే సీబీఐ ప్రధానంగా ఫోకస్ చేసింది.. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ డ్రగ్ డీలరుతో జరిపిన వాట్సాప్ చాటింగ్ బయటకొచ్చింది. దీన్ని పరిశీలించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిందీ. దీంతో సుశాంత్ కేసు కీలక మలుపు తిరిగింది. Also Read: ఆర్ఆర్ఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 27, 2020 / 07:26 PM IST
    Follow us on


    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక రహస్యాలను సీబీఐ వెలికి తీస్తోంది. తవ్వినకొద్దీ ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి మీదే సీబీఐ ప్రధానంగా ఫోకస్ చేసింది.. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ డ్రగ్ డీలరుతో జరిపిన వాట్సాప్ చాటింగ్ బయటకొచ్చింది. దీన్ని పరిశీలించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిందీ. దీంతో సుశాంత్ కేసు కీలక మలుపు తిరిగింది.

    Also Read: ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ ఇచ్చిన ఆలియా భట్‌

    సుశాంత్ ముంబైలోని ఫ్లాట్ లో మరణించినప్పుడు ఆ ఇంటిలోని ఆధారాలన్నీ తుడిచిపెట్టారని సీబీఐ విచారణలో నిగ్గుతేలినట్టు సమాచారం. రియా సమక్షంలోనే హార్డ్ డిస్క్ ల ధ్వంసం జరిగినట్లు సీబీఐకి ఆధారాలు లభించినట్లు తెలిసింది.. రియాకు చెందిన రెండు మొబైల్ ఫోన్‌లను సీబీఐ జప్తు చేసింది. అయితే అప్పటికే చాలా డేటా ఆ ఫోన్ల నుంచి అదృశ్యమైనట్టు గుర్తించింది. తొలగించిన డేటాను తిరిగి పొందడానికి వారు వాటిని క్లోన్ చేశారని సమాచారం. ఇది సంచలనాత్మక ఫలితాలకు దారి తీస్తుందని సీబీఐ అధికారులు నమ్ముతున్నారు. ఈ కేసులో రియాతో సహా పలువురు సన్నిహితులపైనే సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది.

    ఇక రియా చక్రవర్తికి డ్రగ్స్ ముఠాతోనూ సంబంధాలు ఉండడంతో ఈ డ్రగ్స్ లింకుతోనే రియా… సుశాంత్ ను చంపిందా అన్న కోణంలో సీబీఐ ఆరాతీస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సుశాంత్ మరణానికి డ్రగ్స్ కూడా కారణమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రియా డ్రగ్ వ్యాపారి గౌరవ్ ఆర్యతో చాటింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

    సీబీఐ దర్యాప్తులో రియాకు సంబంధించిన కీలక విషయాలను సుశాంత్ స్నేహితుడు పితాని సిద్ధార్త్ ఈ గుట్టు బయటపెట్టినట్టు సమాచారం. జూన్ 8న సుశాంత్ తో రియా చక్రవర్తి తీవ్రంగా గొడవపడిందని.. జూన్ 15న సుశాంత్ మరణించడం వెనుక అదీ ఒక కారణం కావచ్చని సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ సీబీఐకి తెలిపాడు.

    Also Read: దానికి కూడా రష్మికనే రికమెండ్‌ చేసిన విజయ్!

    ఇక సుశాంత్ నివాసంలో ఆధారాలు దొరకకుండా 8 హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేయడం..సుశాంత్ మేనేజర్, వంటమనిషి అక్కడే ఉన్నారని వివరించాడు. హార్డ్ డిస్క్ ల్లో ఏముందో తెలియదని సిద్ధార్థ్ తెలిపాడు.

    రియా.. సుశాంత్ డెబిట్ కార్డుల పాస్‌వర్డ్‌లను దొంగిలించిందని, దీనికోసం ఆమె సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా సహాయం తీసుకుందని సీబీఐ వర్గాలు గుర్తించినట్టు సమాచారం. రియా బ్యాంక్ మోసాలతోపాటు మాదకద్రవ్యాలతో లింకు పెట్టుకుందని సీబీఐ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సుశాంత్ మరణానికి రియానే కారణమన్న అనుమానాలకు బలం చేకూరుతోందన్న వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి.