‘టీటీడీ’ వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం ఇదే..!

టీటీడీకి చెందిన భూములను విక్రయించాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. స్వపక్షం, విపక్షాలు, భక్తులు అందరి నుంచి టిటిడి ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు భూముల విక్రయంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హాయంలోని ట్రస్టు బోర్డు 50 ఆస్తులు విక్రయించాలని 2016, జనవరి 30 తేదీన నిర్ణయం తీసుకుంది. […]

Written By: Neelambaram, Updated On : May 26, 2020 12:56 pm
Follow us on


టీటీడీకి చెందిన భూములను విక్రయించాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. స్వపక్షం, విపక్షాలు, భక్తులు అందరి నుంచి టిటిడి ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు భూముల విక్రయంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హాయంలోని ట్రస్టు బోర్డు 50 ఆస్తులు విక్రయించాలని 2016, జనవరి 30 తేదీన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి తీర్మానం 253 నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేసింది.

టిటిడి ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భూముల అమ్మకంపై చర్చించారు. సమావేశం అనంతరం విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంపై మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్యపక్షాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ స్థలాల్లో దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలు లాంటివి చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కొద్ది రోజుల క్రితం టిటిడి వేరే రాష్ట్రాల్లో ఉన్న 50 ఆస్తులను వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు, ప్రముఖుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని, అప్పటి వరకు తీర్మానాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినా చర్చల అనంతరం ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.