తొలిరోజే చంద్రబాబుకు ఎదురుదెబ్బ..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు నెలలు సుదీర్ఘ విరామం తరువాత అమరావతి చేరుకున్నారు. వచ్చిన రోజే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ విమర్శల పాలయ్యారు. ఇదే విషయంలో బాబు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఇబ్బడి ముబ్బడిగా విమర్శలు గుప్పించి, పోలీసు కేసులు, హైకోర్టులో పిటీషన్ లు వేయించడంతో కసితో ఉన్నారు. టీడీపీ నేతలు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్న వైసీపీ నేతలకు నేరుగా టీడీపీ అధినేత చిక్కారు. బాబు రాక సందర్భంగా ఆ పార్టీ […]

Written By: Neelambaram, Updated On : May 26, 2020 11:38 am
Follow us on


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు నెలలు సుదీర్ఘ విరామం తరువాత అమరావతి చేరుకున్నారు. వచ్చిన రోజే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ విమర్శల పాలయ్యారు. ఇదే విషయంలో బాబు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఇబ్బడి ముబ్బడిగా విమర్శలు గుప్పించి, పోలీసు కేసులు, హైకోర్టులో పిటీషన్ లు వేయించడంతో కసితో ఉన్నారు. టీడీపీ నేతలు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్న వైసీపీ నేతలకు నేరుగా టీడీపీ అధినేత చిక్కారు.

బాబు రాక సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లాక్ డౌన్ నిబంధనలు గాలికొదిలేశారు. చంద్రబాబు కాన్వాయ్ తెలంగాణా బోర్డర్ ఏపీలో ప్రవేశించిన క్రమంలో స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు సామాజిక దూరం, మాస్క్ లు ధరించ చేయలేదు. గారికపాడు చెక్ పోస్టు, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ ప్రాంతాల్లో టీడీపి నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో వచ్చి బాబు, లోకేష్ లకు స్వాగతం పలికారు. ఎక్కడా సామాజిక దూరం కనిపించలేదు.

దీంతో ఎమ్మెల్సీ వి.గోపాలరెడ్డి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అమరావతిలోని తన నివాసానికి చేరుకునే సమయంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదని, వందల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు గుంపులుగా ఉంటూ, సామాజిక దూరం పాటించకుండా, మాస్క్ లు ధరించకుండా ఉన్నారని, కరోనా వ్యాప్తికి అనుకూలంగా వ్యవహరించారని పిర్యాదులో పేర్కొన్నారు.