టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ ఏది చేసినా సంచలనమే.. రాజకీయమైనా.. సినిమా రంగమైనా ఆయనకు అభినమానులు ఎక్కువ. సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ వెన్నంటే ఉండి యువరాజ్యాన్ని నడిపించాడు. అన్న ప్రజారాజ్యాన్ని పక్కన పెట్టేశాక.. తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో నూతన రాజకీయ పార్టీని పెట్టారు. ఇంతకీ పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన సందర్భం.. కారణం ఎవరికీ అర్థం కాలేదు. నిలకడ లేని పవర్ స్టార్.. రెండు రాష్ట్రాలో పార్టీని అభివృద్ధి చేయాలని ఎంతో అనుకుంటున్నా.. అది సాధ్యం అవడం లేదు.
Also Read: కోవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోడీ.. ఆయనకు వేసిన టీకా ఏదంటే?
అప్పుడప్పుడు తెరపైకి వచ్చే జనసేన అధినేత వపన్ కల్యాణ్ కు హఠాత్తుగా తెలంగాణలో తమ పార్టీ ఉందన్న సంగతి గుర్తుకొచ్చింది. ఎందుకు ఆలోచన వచ్చిందో కానీ.. తెలంగాణ వీరమహిళల సమావేశాన్ని ఏర్పాటు చేసి .. కేసీఆర్ కు టైం ఇచ్చానని.. ఆ టైం అయిపోయిందని మాట్లాడారు.ఒక తెలంగాణలోనూ తేల్చుకుంటామన్నట్టు ఆయన ప్రసంగం సాగింది. నిన్నగాక మొన్ననే గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని అభ్యర్థలను ప్రకటించి.. తరువాత బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని గుర్తించి వైదొలిగిన వపన్ కల్యాణ్ నిర్ణయం ఇంకా జన సైనికుల మదిలో మెదులుతోంది.
ఇప్పుడు హఠాత్తుగా బీజేపీని గెలిపించాల్సిన అవసరం లేదని ఎందుకు అనుకుంటున్నారో కానీ.. తన పార్టీని ఎందుకు తెలంగాణలో ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారో అని చాలా మందిలో క్లారిటీ రావడం లేదు. ఇంత వరకు ఏపీలో వీరహిళల సమావేశాలనే పూర్తిస్థాయిలో పెట్టలేదు. కావాలనే తెలంగాణలో వీర మహిళ సమావేశాన్ని పెట్టారని అర్థం అవుతోంది.
Also Read: రసకందాయంలో టెక్కలి నియోజకవర్గం..!
షర్మిల రాజకీయ పార్టీ అంశం తెలంగాణలో చర్చనీయంశంగా అవుతోంది. ఆమె ఎవరో వదలిని బాణం అని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో ఇప్పటి వరకు యాక్టివ్ గా లేని పవన్.. ఇప్పుడు ఎన్నడూ లేనంత నమ్మకంతో తెరపైన ప్రయత్నాలు చేయడం ఆసక్తిగా అనిపిస్తోంది. పవన్ కల్యాణ్ వెనక కూడా కొన్ని రాజకీయ పార్టీ వ్యూహం ఉందని చర్చ జోరుగా సాగుతోంది.తెలగాణపై ఆంధ్రా పార్టీల దాడి జరుగుతోందని చెప్పడానికి పవన్ అడుగులు ఉపయోగపడతాయని కొంతమంది అంచనా వేస్తున్నారు. వపన్ తెలంగాణలో పార్టీని యాక్టివేట్ చేయడం వెనక ఇతర పార్టీల రాజకీయ వ్యూహం ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్