AP Politics: ఆ బ్రాండ్స్ తెచ్చింది చంద్రబాబే.. కౌంటర్లు వేస్తున్న వైసీపీ..

AP Politics: ఏపీలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా టీడీపీ వదులుకోవడం లేదు. అటు అధికార పార్టీ కూడా అలాగే చేస్తోంది. తమపై వస్తున్న విమర్శలకు తిప్పికొట్టడంలో చాలా స్పీడ్ గానే వ్యవహరిస్తోంది. ఇక ఈ రాజకీయంలోకి కొత్త మద్యం విషయం వచ్చి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా.. ఏపీలోని మద్యం గురించి అక్కడ చేపుకుంటారనే మాట ఉండేది. కానీ ఇదంతా […]

Written By: Mallesh, Updated On : March 21, 2022 4:40 pm
Follow us on

AP Politics: ఏపీలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా టీడీపీ వదులుకోవడం లేదు. అటు అధికార పార్టీ కూడా అలాగే చేస్తోంది. తమపై వస్తున్న విమర్శలకు తిప్పికొట్టడంలో చాలా స్పీడ్ గానే వ్యవహరిస్తోంది. ఇక ఈ రాజకీయంలోకి కొత్త మద్యం విషయం వచ్చి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా.. ఏపీలోని మద్యం గురించి అక్కడ చేపుకుంటారనే మాట ఉండేది. కానీ ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్స్ అన్నీ జే బ్రాండ్లు అంటూ టీడీపీ పేరు పెట్టి ఆందోళన మొదలుపెట్టింది. ఆ బ్రాండ్లు అన్నీ చీప్ లిక్కర్ అని.. వాటిని అమ్ముతు మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంపైనే సుమారు మూడు రోజులుగా ఆందోళనలు పెంచింది.

Chandrababu and jagan

ఈ టైంలో వైసీపీ నుంచి కొత్త వాదన వినిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఏ ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదట. అంటే ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్స్ అన్నీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే అనుమతి ఇచ్చినవని టాక్. ఇక ఈ జే బ్రాండ్లపై ఏపీ సర్కారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Also Read: మీడియా ముందుకు వ‌స్తున్న ఏబీవీ.. పెగాస‌స్ విష‌యంలో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డిస్తారా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్ముతున్న బ్రాండ్లలో ఏ డిస్టిలరీకి వైసీపీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని చెబుతున్నారు. ప్రస్తుతం అమ్ముతోంది చీప్ లిక్కర్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో అమ్ముతున్న బ్రాండ్లు ఆ రాష్ట్రంలో మినహా దేశంలో ఎక్కడా అమ్మడానికి వీలుండదు. మద్యం బాటిళ్లపైనా ఫర్ సేల్ ఇన్ ఆంధ్రా ఓన్లీ అని ఉంటుంది. ఇక మూతపడిపోయిన డిస్టిలరీలు, సిక్ అయిన డిస్టిలరీలు మరి కొన్ని సొంత పార్టీ వారి నుంచి లీజుకు తీసుకుని ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఈ బ్రాండ్లను తయారు చేస్తున్నారని చాలా రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ బ్రాండ్లను చంద్రబాబుకు అంటగడుతున్నారు అధికారులు, వైసీపీ నేతలు.

ఇక ఏపీలో ఇప్పటికీ పాపులర్ బ్రాండ్ల మద్యం లభించడం లేదు. దేశంలో ఎక్కడా లేని మద్యాన్ని ఏపీలో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అదీ కూడా వైసీపీ నేతల డిస్టిలరీల నుంచే కొనుగోలు చేస్తారని టాక్. మద్యం దుకాణాల్లో ఆన్‌లైన్ పేమెంట్లను అనుమతించడం లేదు. కేవలం నగదును మాత్రమే చెల్లించాలి. మద్యం వ్యాపారంలో ఇన్ని లొసుగులు ఉన్నా.. ప్రభుత్వం అన్ని రాజకీయ అంశాల్లాగే ప్రస్తావిస్తూ.. ఇదంతా చంద్రబాబు పనే అంటూ వాదనలు వినిపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.

Also Read: కేసులు, పెగాసస్.. జగన్, చంద్రబాబులను ఏపీ రాజకీయాల నుంచి బీజేపీ సాగనంపబోతోందా?

Recommended Video:

Tags