Jalsa Web Series Review: నటీనటులు: విద్యాబాలన్, షెఫాలీ షా, రోహిణి హట్టంగడి, సోఫియా ఖాన్, గుర్పాల్ సింగ్ తదితరులు
దర్శకత్వం: సురేష్ త్రివేణి
రచన: ప్రజ్వల్ చంద్రశేఖర్, అబ్బాస్ దలాల్, హుస్సేన్ దలాల్, సురేష్ త్రివేణి
నిర్మాతలు: భూషణ్ కుమార్, కిషన్ కుమార్, సురేష్ త్రివేణి
మ్యూజిక్: గౌరవ్ చటర్జీ
సినిమాటోగ్రఫి: సౌరభ్ గోస్వామి
కథ :
మాయా మీనన్ (విద్యా బాలన్) ఒక టాప్ న్యూస్ యాంకర్. ఆమె ఓ న్యాయమూర్తిని తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసి అతని పరువు తీస్తోంది. పైగా ఆమె ప్రశ్నలకు ఇబ్బందుల్లో పడతాడు ఆ న్యాయమూర్తి. ఫలితంగా న్యాయమూర్తి ఇంటర్వ్యూ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతూ అతని పేరు పోతుంది. అలాంటి బలమైన యాంకర్ గా మాయా మీనన్ గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటుంది. అయితే, అలియా (కషిష్ రిజ్వాన్) అనే అమ్మాయిని కారుతో యాక్సిడెంట్ చేస్తోంది. ఈ యాక్సిడెంట్ లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అలియాని అలాగే వదలేసి వెళ్ళిపోతుంది. ఆ తరువాత అలియాకి ఏమి జరిగింది ? ఇంతకీ ఆ యాక్సిడెంట్ మాయా మీనన్ జీవితాన్ని ఎలా మార్చింది ? ఇంతకీ ఈ యాక్సిడెంట్ కారణంగా కథలో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ జల్సా చిత్రం విద్యా బాలన్ చాలా బాగా చూపించింది. అలాగే జల్సా సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన షెఫాలీ షా కూడా చాలా బాగా నటించింది. ఆమె విద్యా బాలన్ ఇద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి నటించారు. ముఖ్యంగా యాక్సిడెంట్‌కు ముందు విద్యా బాలన్ బాడీ లాంగ్వేజ్, ఆ తర్వాత చోటు పరిస్థితులకు తగ్గట్టు మారిపోయిన ఆమె నటన చాలా బాగుంది. ముఖ్య పాత్రలో నటించిన ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఇక టెక్నికల్ గా చూసుకున్న ఈ సినిమా మరో మెట్టు పైనే ఉంది. కాకాపోతే ప్లేలో కన్ ఫ్యూజన్ ఉండటం కారణంగా బి.సి ఆడియన్స్ కు ఈ సినిమా పూర్తి స్థాయిలో కనెక్ట్ కాదు. మెయిన్ గా సినిమాలో అంత హెవీ డ్రామా సృష్టించిన తర్వాత ఆ గ్రాఫ్ ను అలాగే కంటిన్యూ చేయడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. అలాగే ప్రేక్షకులను నిరాశపరిచే విధంగా సినిమాను సాధారణ ఎండింగ్ తో ముగించాడు. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా ఇన్ వాల్వ్ చేసే కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.
ప్లస్ పాయింట్స్ :
విద్యా బాలన్ నటన,
టేకింగ్, మేకింగ్,
కథాకథనాలు,
సాంకేతిక విలువలు
మైనస్ పాయింట్స్:
కీలక అంశాలను మిస్ చేయడం,
అక్కడక్కడ కన్ ఫ్యూజన్ గా ఉండటం,
ఫస్ట్ హాఫ్
సినిమా చూడాలా ? వద్దా ?
భిన్నమైన క్రైమ్ ఎమోషన్స్ తో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డార్క్ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వారికీ ఈ చిత్రం అద్భుతం అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల లవర్స్ కి మాత్రం ఈ చిత్రం కనెక్ట్ కాదు. ఓవరాల్ గా ఈ చిత్రం ఎవరైనా ఒకసారి చూడొచ్చు.
రేటింగ్ : 2.25 / 5
Also Read: Telangana Congress Party: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న హరీశ్‌రావు.. వీహెచ్‌కు పైసలిచ్చిండట..!
Recommended Video: