
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలు మారుతున్నాయే తప్ప పాలనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ ప్రజలకు చుక్కలు చూపిస్తే వైసీపీ పాలన కూడా టీడీపీకి ఏ మాత్రం తగ్గట్లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సంక్షేమం విషయంలో జగన్ సర్కార్ పాలన బాగానే ఉన్నా అభివృద్ధి సంగతేమిటని జనాలు ప్రశ్నిస్తున్నారు. 16 నెలల వైసీపీ పాలనలో మచ్చుకైనా అభివృద్ధి కనిపించడం లేదని చెబుతున్నారు.
Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?
టీడీపీ రాజధాని పేరు మాత్రమే ప్రకటించి గ్రాఫిక్స్ ఫోటోలతో ఐదేళ్ల కాలం వెళ్లదీస్తే గ్రాఫిక్స్ ఖర్చు విషయంలో వైసీపీ టీడీపీకి గట్టి పోటీ ఇస్తోంది. వైసీపీ రాజకీయ వర్గాల నుంచి తెలుస్తున్న ప్రకారం హైకోర్టు నుంచి మూడు రాజధానుల అమలుకు గ్రీన్ సిగ్నల్ రాకపోయినా జగన్ విశాఖ, కర్నూల్, అమరావతిలకు సంబంధించిన గ్రాఫిక్స్ లను తయారు చేయిస్తున్నారని తెలుస్తోంది. ఈ గ్రాఫిక్ నమూనాలను ప్రజల ముందుంచి ఏ విధంగా రాజధానులను అభివృద్ధి చేయబోతుందో ప్రజలకు తెలిసేలా వైసీపీ ప్రయత్నం చేస్తోందని సమాచారం.
ఈ విషయం తెలిసిన విశ్లేషకులు, నెటిజన్లు టీడీపీ గ్రాఫిక్స్ జిమ్మిక్కులతోనే ఐదేళ్ల కాలం వెళ్లదీసిందని, వైసీపీ కూడా మరో మూడున్నరేళ్లు గ్రాఫిక్స్ ఫోటోలతో కాలం వెళ్లదీయాలని ప్రయత్నిస్తోందా…? అని కామెంట్లు చేస్తున్నారు. విశాఖలో జగన్ సర్కార్ ప్రస్తుతం గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడుతోందని గెస్ట్ హౌస్ గ్రాఫిక్ డిజైన్ కోసం ఏకంగా 25 లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం.
ఈ విషయం తెలిసి షాక్ అవ్వడం ప్రజల వంతవుతోంది. గెస్ట్ హౌస్ గ్రాఫిక్ డిజైన్ కోసం 25 లక్షల రూపాయల ప్రజల సొమ్ము వృథా చేయడం అవసరమా…? అని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. టీడీపీని మించిన వృథా వైసీపీ హయాంలో జరగబోతుందా…? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు వైసీపీ ఏం సమధానం చెప్పబోతుందో చూడాల్సి ఉంది.
Also Read : కేంద్రంలో వియ్యం.. రాష్ట్రంలో కయ్యం..