రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయం..!

రాజ్యసభ వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరపున అభ్యర్థులుగా పోటీచేసిన మోపిదేవి వెంకటరమణారావు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్‌ నత్వానీలు ఎన్నికల్లో విజయం సాధించారు. దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 19 స్థానాలకు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు గెలుపొందారు. రాపాక దూకుడుకి.. పవన్ బ్రేక్ వేసేదెప్పుడు..? గెలుపొందిన సభ్యులకు ఒక్కొక్కరికి 38 ఓట్ల చొప్పున వచ్చాయి. 175 […]

Written By: Neelambaram, Updated On : June 20, 2020 10:06 am
Follow us on


రాజ్యసభ వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరపున అభ్యర్థులుగా పోటీచేసిన మోపిదేవి వెంకటరమణారావు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్‌ నత్వానీలు ఎన్నికల్లో విజయం సాధించారు. దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 19 స్థానాలకు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు గెలుపొందారు.

రాపాక దూకుడుకి.. పవన్ బ్రేక్ వేసేదెప్పుడు..?

గెలుపొందిన సభ్యులకు ఒక్కొక్కరికి 38 ఓట్ల చొప్పున వచ్చాయి. 175 మంది శాసన సభ్యులకు 173 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇద్దరు శాసన సభ్యులు గైర్హాజరయ్యారు. వీరిలో ఇ.ఎస్.ఐ స్కామ్ లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు, క్వారంటైన్ లో ఉన్న అనగాని సత్య ప్రసాద్ ఉన్నారు. ఎమ్మెల్యేల ఓట్లలో 4 ఓట్లు చెల్లనివని అధికారులు స్పష్టం చేశారు. వీటిలో మూడు టీడీపీ రెబల్ అభ్యర్థులవి ఉన్నాయి. చెల్లిన 169 ఓట్లే మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. టీడీపీ తరపున పోటీచేసిన వర్లరామయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు.

రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలు తీసుకుంటుందా?

మరోవైపు రాజ్యసభ ఎన్నికల ఓటింగులో జనసేన ఎమ్మెల్యే పార్టీ నుండి సమాచారం లేదంటూ వైకాపా అభ్యర్థికి ఓటేశానని, వైసీపీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన విషయంలో పార్టీ ఎంత వరకూ స్పందించలేదు.