మూడునెలలు నిరవధికంగా సాగిన లాక్ డౌన్ పేద మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచింది. చిరు వ్యాపారులు ఆదాయం కోల్పోగా, ప్రైవేట్ ఉద్యోగుల జీతాలలో కోతపడింది. కొందరు ఏకంగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇక రోజువారి కూలీల వెతలు ఎంత చెప్పినా తక్కువే. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పియిన శ్రామిక జనానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచుతూ పేదవాడిపై పెనుభారం మోపుతోంది.
రాపాక దూకుడుకి.. పవన్ బ్రేక్ వేసేదెప్పుడు..?
గత 14 రోజులుగా కేంద్రప్రభుత్వం వరుసగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తుంది. రెండు వారాలలో కేంద్రం ఏకంగా రూ. 7 పైగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 85.72 కు చేరింది, అలాగే డీజిల్ రూ. 75.52 గా ఉంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి.దాని పర్యవసానంగా నిత్యావసర వస్తువుల ధరలపై ఆ భారం పడుతుంది. అంటే నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వస్తాయి.దీనితో పేదవాడిపై పెనుభారం పడుతుంది.
రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలు తీసుకుంటుందా?
మరి నిరవధికంగా కేంద్రం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్న క్రమంలో…దీనిపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏందీ అనేది ఇక్కడ ప్రశ్న. పెట్రోల్ ధరల పెరుగుదల గురించి ఆయన మోడీని ప్రశ్నించరా?. ప్రశ్నించుకున్నా సోషల్ మీడియా వేదికగా ఆయన అభిప్రాయం తెలియజేయాలని కొందరు భావిస్తున్నారు. బీజేపీతో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. అదే సమయంలో జవాబుదారిగా కూడా ఉండాలి. అడ్డగోలుగా పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి మాట్లాడాల్సిన బాధ్యత, ఎవరైనా అడిగితే జవాబు చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉంది. ప్రతి సామాజిక, రాజకీయ అంశంపై స్పందిచే పవన్ ఈ విషయంపైన కూడా తన స్టాండ్ తెలియజేస్తే బాగుంటుంది.