https://oktelugu.com/

Bangaru Telangana: తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?

Bangaru Telangana: బంగారు తెలంగాణ కోసం ఎందరో కలలు కన్నారు. ఎందరో ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ర్టం వచ్చినా తెలంగాణలో మాత్రం సమస్యలు మాత్రం తీరడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాటి ఊసే కనిపించడం లేదు. అంతా స్వార్థమే అని ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. రాజకీయం ముసుగులో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. నీతి కోసం మా పాలన అంటూ చెప్పుకుంటున్నా […]

Written By: , Updated On : March 28, 2022 / 06:45 PM IST
Follow us on

Bangaru Telangana: బంగారు తెలంగాణ కోసం ఎందరో కలలు కన్నారు. ఎందరో ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ర్టం వచ్చినా తెలంగాణలో మాత్రం సమస్యలు మాత్రం తీరడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాటి ఊసే కనిపించడం లేదు. అంతా స్వార్థమే అని ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. రాజకీయం ముసుగులో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. నీతి కోసం మా పాలన అంటూ చెప్పుకుంటున్నా అంతా అవినీతి అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏంటో అంతుచిక్కడం లేదు.

Bangaru Telangana

Harish Rao, KCR, KTR

తెలంగాణలో ఏళ్లుగా సమస్యల పరిష్కారానికి పోరాటాలు సాగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా నియంత పోకడ సాగుతోంది. రాష్ట్రం అధోగతి పాలవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఓ పక్క ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్నా అప్పులెందుకు చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు మద్యం ఏరులై పారిస్తూ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కోసం మద్యం వ్యాపారం విచ్చలవిడిగా చేస్తోంది.

Also Read: MLA Seethakka: దేశాన్ని విడ‌గొట్టేది ఆ సినిమా.. క‌లిపి ఉంచేది ఈ సినిమా.. ఎంతైనా సీత‌క్క స్టైలే వేరు..

రాష్ట్రంలో ప్రస్తుతం కుటుంబ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి ఆయన కుమారుడు, అల్లుడు, కూతురు అందరు ప్రభుత్వంలో ప్రతినిధులుగా ఉండటం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు సైతం గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రగతి ఆగిపోయిందని తెలుస్తోంది. స్వప్రయోజనాలే తప్ప సామాజిక ప్రయోజనాలు శూన్యమనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ధనిక రాష్ట్రమైనా అప్పులు ఎందుకు చేయాల్సి వస్తుందో చెప్పాలనే ప్రశ్నలు వస్తున్నాయి.

రాబోయే రోజుల్లో అధికారం కోసం పార్టీలు ఇంకెన్ని దొంగ ప్రమాణాలు చేస్తాయో తెలియడం లేదు. టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నికలో డబ్బులు పంచి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందనే ఆరోపణలు సైతం వచ్చాయి. దీంతో రాబోయే రోజుల్లో పరిణామాలు మరీ తీవ్రంగా ఉంటే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పాలన నడుస్తుందా లేక పడకేసిందా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఏది ఏమైనా రాజకీయం కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: Samantha Social Media Promotions: ఒక్కో పోస్ట్ కే ‘సమంత’ అంత అడుగుతుందా ?

Tags