Narendra Modi: శారీరక బలం.. బుద్ధి బలం.. ఈ రెండు పదాలలో బలం ఉన్నప్పటికీ.. నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది. శారీరక బలం పరిమితి కొంతవరకే. కానీ బుద్ధి బలం పరిమితం. బుద్ధి బలాన్ని సరైన సమయంలో ప్రయోగిస్తే విజయాలన్నీ కాళ్ళ ముందు సాగిలపడతాయి. కురుక్షేత్ర సమయంలో అర్జునుడు శారీరక బలాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. త్వరగా అలసిపోయాడు. ఇదే సమయంలో రంగంలోకి దిగిన కృష్ణుడు బుద్ధి బలాన్ని ఉపయోగించి అర్జునుడికి గీత బోధ చేశాడు. తర్వాత ఫలితం ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా రెండేళ్ల క్రితం గాల్వన్ లోయలో చైనా సైన్యం కవ్వింపులకు దిగింది. భారత సైన్యం అందుకు దీటుగానే బదులిచ్చింది. ఈ పోరులో భారత్ కంటే చైనాకే ఎక్కువ సైనిక నష్టం జరిగింది. మనదేశంలో కల్నల్ సంతోష్ వీరమరణం పొందాడు. ఇక అప్పటినుంచి అసలు గేమ్ స్టార్ట్ అయింది. జిన్ పింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది.

…
ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు
..
చాలామంది చైనా ఆర్థికంగా బలంగా ఉన్న దేశం అనుకుంటారు. కానీ దానికి వచ్చే ఆదాయం అంతా ఇతర దేశాల నుంచే. గాల్వన్లోయలో ఉద్రిక్తల తర్వాత భారతదేశం చైనా యాప్ లను నిషేధించింది. దీనివల్ల ఆ దేశానికి ఆదాయం తగ్గింది. అదే సమయంలో చైనా నుంచి దిగుమతి తీసుకునే వస్తువుల సంఖ్య తగ్గింది. ఈ ఆదాయంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు చైనా ఇన్ స్టాంట్ లోన్ యాప్ లను తెరపైకి తీసుకొచ్చింది. ఎటువంటి పూచికత్తు లేకుండానే ఎడపెడా రుణాలు ఇచ్చింది. దీంతో జనాలు కూడా ఎగబడి తీసుకున్నారు. తర్వాత గాని డ్రాగన్ యాప్ సంస్థల తీరు అర్థం కాలేదు. ఇచ్చిన రుణాలు పావలా అయితే.. వసూలు చేసింది రూపాయి. దీంతో కన్నెర్ర చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ లను పూర్తిగా నిషేధించింది. మరోవైపు దొడ్డిదారిన ఇండియా సొమ్మును చైనాకు చేరవేరుస్తున్న మొబైల్ కంపెనీలపై కూడా ఉక్కు పాదం మోపింది. దీంతో ఆదాయం లేక చైనా ఉక్కిరిబిక్కిరి అయింది.
..
జిన్ పింగ్ కు ఊపిరాడకుండా చేశారు
..
వాస్తవానికి ప్రధానమంత్రి కాకముందే జిన్ పింగ్ తో నరేంద్ర మోడీకి మంచి సంబంధాలు ఉండేవి. మోదీ ప్రధాని అయ్యాక.. ఇద్దరూ 18 సార్లు సమావేశం అయ్యారు. మోదీ వ్యక్తిత్వ ప్రభావం వల్ల జిన్ పింగ్ భారత్ విషయంలో దూకుడుగా వ్యవహరించలేకపోయారనే వాదనలు ఉన్నాయి. గాల్వన్లో ఘటన తర్వాత మోడీ చైనా యాప్ లను నిషేధించడంతోపాటు, వ్యాపార సంబంధాలను దాదాపు తెంచేసుకున్నారు. ఈ సమయంలో చైనా సమయమనాన్ని పాటించింది. గల్వాన్ ఘటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు జిన్ పింగ్ కూడా శ్రద్ధ వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో జిన్ పింగ్ భారత్ విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్నారని చైనా కమ్యూనిస్టు పార్టీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భావించింది. అందుకే తాజా తిరుగుబాటు, హౌస్ అరెస్ట్, పి ఎల్ ఎ చీఫ్ పదవి నుంచి జిన్ పింగ్ ను తొలగించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా అధికారిక మీడియా ఇప్పటివరకు ఒక ఖండన కూడా చేయలేదు. వాస్తవానికి గతంలో ఎప్పుడైనా డ్రాగన్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ విరుచుకుపడేది. దాదాపు యుద్ధం చేసినంత పనిచేసేది. ఇటీవల తైవాన్ లో అమెరికా స్పీకర్ నాన్సీ పర్యటించినప్పుడు చైనా మీడియా దూకుడు ప్రపంచమంతా చూసింది. మరి ఇప్పుడు తిరుగుబాటు, జిన్ పింగ్ అరెస్టు, పీఎల్ ఏ పదవి నుంచి తొలగించడం వంటి అంశాలు పుకార్లుగా, కథనాలుగా మీడియాలో వెలువడుతున్నా గ్లోబల్ టైమ్స్ కానీ, చైనా కమ్యూనిస్టు పార్టీ, పీపుల్స్ ప్రిపరేషన్ ఆర్మీ ఏ ఒక్క ప్రకటనా చేయలేదు. అందుకే వీటికి ప్రాధాన్యం ఏర్పడింది.
..
మోడీ పట్టించుకోలేదు
..
ఉజ్బెకిస్తాన్ సమర్కండ్ లో వారం క్రితం జరిగిన షాంగై సహకార సంఘం సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మాట్లాడకపోవడాన్ని డ్రాగన్ ఆర్మీ అవమానంగా భావించింది. జిన్ పింగ్ తో కనీసం కరచాలనం కూడా చేయకుండా ఉండడాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ జీర్ణించుకోలేకపోయింది. అందుకే షాంగై సహకార సంఘ సమావేశాలు ముగించుకుని బీజింగ్ రాగానే జిన్ పింగ్ ను హౌస్ అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జిన్ పింగ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. జిన్ పింగ్ తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ లి కియోమింగ్ ను చైనా అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డ్రాగన్ ప్రపంచ శక్తిగా మారింది. అనేక అంశాల్లో అమెరికా, యూరప్ దేశాలను దిక్కరించగలుగుతున్నది. ఆర్థిక రంగంలోనూ, సైనికపరంగా చైనా చాలా దూకుడుగా ఉంది. ప్రపంచం సంగతి పక్కన పెడితే ఆసియాలో చైనానే పెద్దన్న. ఇది ఎవరూ కాదన లేనిది. అయితే పెద్దన్న అయిన తమను భారత ప్రధాని మోదీ పట్టించుకోకపోవడం, లెక్కచేయకపోవడం చైనా కమ్యూనిస్టు పార్టీకి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి కోపం తెప్పించిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొదట చెప్పినట్టు శారీరక బలం కంటే బుద్ధిబలం ఎన్నోరెట్లు గొప్పది. గల్వాన్ లోయలో శారీరక బలం చూపాలని చైనా ప్రయత్నించింది. ఆ తర్వాత భారత్ బుద్ధి బలాన్ని చూపించి జిన్ పింగ్ ను అనామకుడిని చేసింది. అందుకే పెద్దలు అంటారు పొంగిన పాలు పొయ్యి పాలే అని!!