వుహాన్ ల్యాబ్ పై కొవిడ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడి నుంచే కరోనా వైరస్ లీకైందని వాదనకు బలం చేకూరుతోంది. గబ్బిలాల నుంచే వైరస్ వ్యాప్తి చెందినట్లు ఆరోపణలున్నాయి. 2017లో వుహాన్ ల్యాబ్ ప్రారంభం సందర్భంగా చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చిత్రీకరించిన వీడియోలు సంపాదించింది. దీనిలో శాస్ర్తవేత్తలు బోనులో గబ్బిలాలను పెంచుతున్న దృశ్యాలు ఉన్నాయి. పది నిమిషాల నిడివి గల వీడియో గబ్బిలాలను పట్టుకుని పురుగులు ఆహారంగా ఇస్తున్నట్లు కనిపిస్తుంది. వీడియో కి వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పీ4 ల్యాబ్ నిర్మాణం పరిశోధన అని పేరు పెట్టారు.
ఈ ల్యాబ్ ను సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం మొక్కుబడిగా నివేదిక ఇచ్చింది. పీ4 ల్యాబ్ లోని యానిమల్ రూంలో వివిధ జంతువులు చక్కగా ఉండవచ్చు. సార్స్ కోవ్ 2 వంటి వాటిపై కూడా పని చేయవచ్చు అని తెలిపింది. గబ్బిలాల శరీరం నుంచి వైరస్ నమూనాలు సేకరించి ప్రకృతిలో వదిలేశారని పేర్కొన్నారు. కేవలం వైరస్ నమూనాలు మాత్రమే ల్యాబ్ కు చేర్చాలన్నారు. వీడియో లో మాత్రం బోన్ లో పెట్టిన గబ్బిలాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిజిటల్ ఆర్తైవిస్ట్ జెస్సీ ఈ వీడియో క్లిప్ ను సంపాదించారు. వాట్ రియల్టీ హ్యాపెండ్ ఇన్ వుహాన్ అనే పుస్తకం రాసేందుకు ఈ వీడియోను ఉపయోగించుకున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిన నిపుణుల బృందం చైనాలో 76,000 కోవిడ్ కేసులో 92 మంది అక్టోబర్,డిసెంబర్ మొదటి వారం మధ్యలో అస్వస్థతకు గురైనట్టు గుర్తించింది. వారి డేటాను ఇవ్వాలని కోరగా చైనా తిరస్కరించింది. ఇక వుహాన్ లో బ్లడ్ బ్యాంక్ 2019 డిసెంబర్ కంటే ముందు నమూనాలను పరిశీలిస్తామని పేర్కొంది. దీనికి చైనా నో చెప్పింది
న్యూయార్క్ లోని ది ఎకో హెల్డ్ అలయన్స్ సంస్థ అధ్యక్షుడు వైరాలజిస్ట్ పీటర్ వెస్టాక్ ఈ ల్యాబ్ కు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ కరోనా వైరస్ తొలిసారి మనుషులు సోకిందని వాదనలను ఆయన మొదటి నుంచి ఖండిస్తున్నారు. లాన్సెట్ లో లేఖ ప్రచురణకు సంబంధించిన ఆర్గనైజింగ్, డ్రాఫ్టింగ్ బాధ్యతలు పీటర్ చూశారు. ఆయన సమకూర్చిన నిధులు వుహాన్ ల్యాబ్ లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రయోగాల్లో వైరస్ అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.