అక్కినేని కోడలు అవ్వడం సమంతకు పర్సనల్ గానే కాదు, ప్రొఫెషనల్ గానూ బాగా కలిసొచ్చింది. పెళ్ళికి ముందు ఉన్న క్రేజ్ కంటే, సమంత క్రేజ్ ఇప్పుడు డబుల్ అయింది. అలాగే నటిగా కూడా సమంత మరో మెట్టు ఎదిగింది. క్లిష్టమైన పాత్రలోనైనా ఒదిగిపోతూ తన నటనకు మరింత పదును పెడుతుంది. అయితే తాజాగా సమంత అక్కినేని రెమ్యూనరేషన్ పై ఒక రూమర్ తెగ వైరల్ అవుతుంది.
టాలీవుడ్ హీరోయిన్స్ అందరిలో కంటే కూడా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ సమంతనే. ఆ మధ్య పూజా హెగ్డే, సమంతకు పోటీ ఇచ్చేలా కనిపించింది గానీ, ప్రస్తుతం సమంత బీట్ చేసే హీరోయిన్ ఆమె దరిదాపుల్లో లేదు. పైగా వరుసగా క్రేజీ ఆఫర్లు అందిపుచ్చుకుంటూ.. పెళ్లి తర్వాత కూడా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తోంది.
సహజంగా ఒక హీరోయిన్ కి పెళ్లి తర్వాత ఆఫర్లు తగ్గుతాయి. సావిత్రి, భానుమతి లాంటి గోల్డెన్ హీరోయిన్స్ కే పెళ్లి తర్వాత ఆఫర్లు తగ్గాయి. కానీ, సమంతకు మాత్రం మునుపటి కంటే కూడా, పెళ్లి తర్వాతే మరిన్ని ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ రావడం, ఒక్క సమంతకే సాధ్యం అయింది. తాజాగా ఓ దిగ్గజ ఓటీటీ సంస్థ సమంతకు క్రేజీ ఆఫర్ ను ఆఫర్ చేసింది.
నెట్ ఫ్లిక్స్ సంస్థ సమంతతో ఓ వెబ్ సిరీస్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే, వెబ్ సిరీస్ కంటెంట్ కాస్త బోల్డ్ గా ఉంటుందట. అందుకే అక్కినేని సమంతకు ఈ వెబ్ సిరీస్ కు గానూ ఏకంగా 8 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో గానీ, సమంత అభిమానులకు మాత్రం మంచి కిక్ ను ఇస్తోంది ఈ న్యూస్.