జగన్ బెయిల్ రద్దు: మరింత ఇరికిస్తున్న రఘురామ

ఏపీ సీఎం జగన్ ప్రశాంతంగా తన పాలన తాను చేసుకోనివ్వకుండా వెంటాడుతున్నా ఆ పార్టీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇప్పటికే రఘురామను రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసి ఏపీ సీఎం జగన్ సర్కార్ ప్రతీకారం తీర్చుకుంది. బెయిల్ పై విడుదలయ్యాక కూడా రఘురామ ఎక్కడా తగ్గకపోవడం గమనార్హం. తాజాగా ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. జగన్ […]

Written By: NARESH, Updated On : June 14, 2021 4:53 pm
Follow us on

ఏపీ సీఎం జగన్ ప్రశాంతంగా తన పాలన తాను చేసుకోనివ్వకుండా వెంటాడుతున్నా ఆ పార్టీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇప్పటికే రఘురామను రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసి ఏపీ సీఎం జగన్ సర్కార్ ప్రతీకారం తీర్చుకుంది. బెయిల్ పై విడుదలయ్యాక కూడా రఘురామ ఎక్కడా తగ్గకపోవడం గమనార్హం.

తాజాగా ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. జగన్ కౌంటర్ పై రఘురామా తాజాగా రీజాయిండర్ దాఖలు చేశారు. రీజాయిండర్ లో పలు అంశాలను ప్రస్తావించారు.

రఘురామా రీజాయిండర్ పిటీషన్ లో జగన్ పై ఆరోపణలు చేశారు. జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. నాకు పిటీషన్ వేసే అర్హత లేదనడం అసంబద్దం అంటున్నాడని రఘురామ తరుఫున లాయర్లు వాదించారు. పిటీషన్ విచారణ అర్హతపై ఇప్పటికే కోర్టులు స్పష్టతనిచ్చాయన్నారు. నాపై కేవలం ఎఫ్ఐఆర్ లు మాత్రమే నమోదయ్యాయన్నారు. చార్జ్ షీట్ లు నమోదు కాలేదన్నారు. జగన్ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని పిటీషన్ లో పేర్కొన్నారు.

పిటీషన్ పై విచారణకు.. నా కేసులకు సంబంధం లేదని రఘురామ తరుఫున న్యాయవాదులు వాదించారు. నాపై అనర్హత వేటుకు.. ఈ పిటీషన్ కు సంబంధం లేదన్నారు.

సీబీఐలోని కొందరు వ్యక్తులు ఈ కేసును ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే సీబీఐ ఎలాంటి వైఖరి వెల్లడించలేదన్నారు. ప్రచారం కోసమే పిటీషన్ వేశానన్న ఆరోపణలు నిరాధారమన్నారు. అనంతరం వాదనలు విన్న కోర్టు విచారణను జూలై1కి వాయిదా వేసింది.

జగన్ బెయిల్ రద్దుపై పంతంగా ఉన్నట్టు రఘురామ పిటీషన్ చూస్తే అర్థమవుతోంది. సీఎం జగన్ ఎంత పకడ్బందీగా ఈ పిటీషన్ వేసినా కూడా దానికి రీజాయిండర్లు వేస్తూ రఘురామ ఇరికిస్తూనే ఉన్నట్టు కనపడుతోంది. జగన్ బెయిల్ ఎలాగైనా సరే రద్దు చేయాలన్న పంతం రఘురామలో కనిపిస్తున్నట్టుగా ఉంది.