Jammu and Kashmir Bridge: ఒక 20 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్‌ను చూస్తేనే మనం ఆశ్చర్యపోతాం. ఏంట్రా ఇంత ఎత్తు ఉంది అని అనుకుంటాం. అంతెందుకు మెట్రో స్టేషన్లు కొంచెం ఎత్తున ఉంటేనే కాస్తంత టెన్షన్ పడుతాం. అలాంటిది ఆకాశాన్ని తాకే బిల్డింగుల గురించే మనం ఇప్పటి వరకు వింటున్నాం. అయితే ఆకాశంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది. హా ఇప్పుడు విమానాల్లో ప్రయాణిస్తున్నాం కదా అనుకుంటారా.. అక్కడే మీరు పప్పులో కాలేశారండోయ్.

నేనన్నది విమానాల్లో కాదు.. రైలు ఆకాశంలో ప్రయాణిస్తే ఎలా ఉంటుందో చెప్పండి. అవును మీరు విన్నది నిజమే. ఆకాశమంత ఎత్తులో రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఎక్కడో అనుకునేరు మన ఇండియాలోనే నిర్మిస్తున్నారు. ఆసేతు ఎత్తైన హిమాలయ పర్వతాల నడుమ దీన్ని కడుతున్నారు. ఈ రైల్వే బ్రిడ్జి ఏకంగా మేఘాలకంటే ఎత్తులో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది.

Also Read: ఉత్తరాంధ్రలో ఉద్యమానికి బీజేపీ సై.. జనసేన ఏమంటుందో..?
కాగా ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గా రికార్డు కొట్టేసింది. దీని పేరు చీబన్ బ్రిడ్జ్. జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని రియాసీ జిల్లాలో దీన్ని కడుతున్నారు. దీనికి సంబంధించిన కొత్త ఫొటోలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ షేర్ చేశారు. దీని పొడవు దాదాపు 1,315 మీటర్ల ఉందని చెబుతున్నారు. కాగా ఈఫిల్ టవర్ కంటే కూడా ఇది ఒక 35 మీటర్ల ఎత్తు ఎక్కువగానే ఉందండోయ్.
ఈ ప్రాంతంలో ఉండే వ్యాలీల మధ్య కనెక్టివిటీని పెంచే క్రమంలో ఇంత ఎత్తైన బ్రిడ్జిని నిర్మిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ బ్రిడ్జి సముద్ర మట్టానికి సరిగ్గా 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. అయితే డిఫరెంట్ యాంగిల్స్ లో తీసని ఈ బ్రిడ్జి ఫొటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. చూసినంతల్నే వావ్ అనిపించేలా ఉన్నాయి. మరి లేటెందుకు మీరు కూడా చూసేయండి.
Also Read: మంత్రి సిదిరి అప్పలరాజుకు శారదా పీఠం వద్ద ఘోర పరాభవం