Big Movie Posters: సినిమా అంటేనే రంగుల మాయ. ఇక్కడ పోస్టర్ దగ్గరి నుంచి, మేనరిజం దాకా మనకు చూసినంతల్నే వావ్ అనిపిస్తాయి. అయితే ఏ సినిమాలో అయినా కాపీ ప్రపంచమే ఉందంటున్నారు విశ్లేషకులు. పెద్ద సినిమాలు కూడా ఇలా ఇతర సినిమాల నుంచి కొన్ని పోస్టర్లను కాపీ కొట్టాయండోయ్. అవేంటో ఇప్పుడు చూద్దాం. బాహుబలి-1 మొదటి పోస్టర్ ను అంతా వావ్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత దీన్ని సైమన్ బిర్చ్ అనే మూవీ నుంచి తీసుకున్నారని తెలిసి అంతా షాక్ అయిపోయారు.

ఇక రజినీకాంత్, శంకర్ మూవీ రోబో2.0 కూడా అంతే. దీని పోస్టర్ ను హాలీవుడ్ మూవీ అయిన ఇట్ ఆల్ ఎండ్స్ నుంచి కాపీ కొట్టేశారు. ఇక ప్రభాష్ మూవీ సాహో పోస్టర్ పరిస్థితి కూడా అంతే. దీన్ని బ్రేకింగ్ బ్యాడ్ అనే మూవీ నుంచి కాపీ కొట్టారంట. అలాగే రజినీకాంత్, పా రంజిత్ మూవీ అయిన కబాలి పోస్టర్ ను కూడా చైనా మూవీ టిక్ టిక్ ను చూసి డిజైన్ చేశారు. దీని మీద పెద్ద రగడ సాగింది అప్పట్లో. ఇక అక్కినేని అఖిల్ ఫస్ట్ మూవీ అఖిల్ పోస్టర్ ను డ్రాగన్ బాల్ మూవీని చూసి అలాగే దించేశారు.

అఖిల్ అక్కినేని మొదటి సినిమా అఖిల్ పోస్టర్ కూడా హాలీవుడ్ నుంచి కాపీ కొట్టిందే. 2009లో విడుదలైన డ్రాగన్ బాల్ సినిమా నుంచి ఇది కాపీ కొట్టారు. ఇక ప్రభాస్ మరో మూవీ రాధేశ్యామ్ పోస్టర్‌కూడా కంచె మూవీ నుంచి కాపీ కొట్టిందే. ఇక మరో మూవీ ఆదిపురుష్ పోస్టర్ కూడా హాలీవుడ్ సంచలన మూవీ అవేంజర్స్ నుంచే కాపీ కొట్టారంట.

సమంత నటించిన యూ టర్న్ కూడా హాలీవుడ్ మూవీ కొలాటరల్ బ్యూటీ ని బేస్ చేసుకుని పోస్టర్ డిజైన్ చేశారు. ఇక విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం మూవీ పోస్టర్ ను మిషన్ ఇంపాజిబుల్ అనే హాలీవుడ్ సినిమా నుంచి తీసుకున్నారు. ఇక రామ్ చరణ్ నటించిన ధృవ మూవీ కూల్ పోస్టర్ ను ఇన్ఫినిటీ నుండి తీసుకున్నారంట.

Also Read: భారీ రోడ్డు ప్రమాదం.. హీరోలా వచ్చి కాపాడిన సోనూసూద్ !
దళపతి విజయ్, మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన తుపాకి మూవీ పోస్టర్‌ను ఎన్ ఆఫీసర్ అండ్ జెంటిల్ మెన్ అనే హాలీవుడ్ మూవీ నుంచి తీసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు మనల్ని వావ్ అనిపించిన మూవీ పోస్టర్లు అన్నీ కూడా ఇతర మూవీలను ఆదర్శంగా తీసుకునే వచ్చాయి.


Also Read: పెళ్లి చేసుకుంటున్నారా.. అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే!
కాంగ్రెసుని ఉతికి పారేసిన మోడీ | PM Narendra Modi Serious Comments On Congress