World Population Review : ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సరైన నిద్ర చాలా అవసరం. ప్రతి వ్యక్తి ప్రతిరోజు కనీసం 8 గంటలపాటు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కానీ నేటి కాలంలో చాలామంది రాత్రులు ఎక్కువగా మేల్కొని ఉంటున్నారు. మొబైల్ ఫోన్లతో పాటు ఇతర కారణాల వల్ల రాత్రులు ఎక్కువ సేపు ఉంటూ ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. అయితే రాత్రిళ్లు ఎక్కువసేపు మెలకువ ఉండడం ఎంత నష్టమో.. ఉదయం ఆలస్యంగా లేవడం అంతే ప్రమాదం అని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా సూర్యోదయానికి ముందే నిద్రలేవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కానీ ఇప్పుడు అందరూ కనీసం 8 గంటలైనా మేల్కొనడం లేదని తెలుస్తుంది. ఈ విషయంలో ఇటీవల ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ సర్వే నిర్వహించింది. ఏ దేశానికి చెందినవారు ఎప్పుడు మేల్కొంటున్నారో..? అనే విషయంపై పేర్కొనబడింది. ఆ వివరాల్లోకి వెళ్తే
భారతదేశం సాంప్రదాయాలకు నిలయం. ఇక్కడ కొన్ని ఆచారాలను పద్ధతులను పురాతన కాలం నుంచి పాటిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా ఆరోగ్యం కోసం కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో ప్రధానమైనది ఉదయం నిద్ర లేవడం. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రోజంతా యాక్టివ్ గా ఉంటారని ఆనాటి కాలంలో పేర్కొనబడ్డారు. దీంతో కొందరు పెద్దలు ఉదయం 5 గంటలకే లేచి తమ పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది రాత్రులు ఎక్కువసేపు మెళకువతో ఉంటూ ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. కనీసం 8 గంటలు పూర్తి కానిదే బెడ్ పైనుంచి దిగడం లేదు.
Also Read : ప్రపంచ జనాభా మరింత తగ్గుతుందా? ఏ దేశాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి?
ఈ తరుణంలో ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ ఓ సర్వే నిర్వహించింది. ఇది వెల్లడించిన ప్రకారం.. ప్రస్తుత కాలంలో భారతీయులు ఉదయం 7.36 గంటలకు నిద్రలేస్తున్నారని తెలిపింది. అయితే వీరిలో కొందరు 8 తర్వాత మేల్కొంటున్నారని తెలిపింది. యావరేజ్ ప్రకారం ఉదయం 7 గంటలకే చాలామంది నిద్ర లేస్తున్నట్టు పేర్కొంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత ప్రజలు ఎక్కువసేపు ఉదయం పడుకుంటున్నారని వెల్లడించింది. ఇందులో భాగంగా సౌత్ ఆఫ్రికా ప్రజలు 6.24 గంటలకే ఉదయం నిద్ర లేస్తారట. అలాగే కొలంబియా 6.31, కోస్టారికా 6.38, ఇండోనేషియా 6.55, జపాన్ అండ్ మెక్సికో 7.09, అమెరికా 7.20, ఆస్ట్రేలియా 7.13 గంటలకు నిద్రలేస్తారని వరల్డ్ పాపులేషన్ రివ్యూ పేర్కొంది.
కొందరు రాత్రిళ్లు విధులు నిర్వహించడం వల్ల ఉదయం ఆలస్యంగా లేస్తారని తెలుపగా.. ఎక్కువ శాతం మంది కాలక్షేపం కోసమే రాత్రులు మేల్కొని ఉన్నారని ఈ సంస్థ పేర్కొంది. మొబైల్ ఫోన్ తో పాటు రాత్రులు స్నేహితులు కలిసి ఉంటూ నిద్రను పాడు చేసుకుంటున్నారని తెలిపింది. దీనివల్ల ఉదయం ఆలస్యంగా లేస్తున్నారని అంటోంది. అయితే ఉదయం ఎంత ముందుగా నిద్ర లేస్తే అంత ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒకప్పుడు ప్రజలు ఉదయం 5 గంటలకే నిద్రలేచి తమ పనులు మొదలుపెట్టేవారు. ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు భోజనం చేసేవారు. దీంతో వారు రోజంతా యాక్టివ్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు మధ్యాహ్నం వరకు కనీసం బ్రేక్ ఫాస్ట్ కూడా చేయనివారు ఉన్నారు. ఈ క్రమంలో అనేక అనారోగ్యాలను తెచ్చుకుంటున్నారు. అందువల్ల సూర్యోదయానికి ముందే లేచే ప్రయత్నం చేయాలని కొందరు చెబుతున్నారు.
Also Read : ప్రపంచ జనాభా వేగంగా తగ్గుతుంటే 2100 నాటికి ఎంత మంది మిగిలిపోతారు?